Pooja Hegde: పూజ నోట పొరపాటున ఆ మాట.. ఇక ట్రోలింగ్‌ షురూ!

నోరు జారడం పాపం… ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ మధ్య కాలంలో ఈ గోల ఎక్కువైంది. మాటల ఫ్లోలో ఒక మాట బదులు ఇంకో మాట అన్నా, సరిగ్గా పలకపోయినా ఇక మనిషి పని అయిపోయినట్లే. మామూలు వ్యక్తులకు ఈ సమస్య తక్కువ. కానీ సెలబ్రిటీల దగ్గరకు వచ్చేసరికి ఈ ట్రోలింగ్స్‌ సమస్య బాగా ఎక్కువైపోయింది. తాజాగా ఈ ట్రోలింగ్‌ దెబ్బకి పాన్‌ ఇండియా నాయిక పూజా హెగ్డే బుక్‌ అయిపోయింది.

‘రాధేశ్యామ్‌’ సినిమా విడుదల సందర్భంగా పూజా హెగ్డే వరుసగా ప్రెస్‌ మీట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా గడుపుతోంది. అలా మొన్నామధ్య ఓ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో సక్సెస్‌ గురించి హోస్ట్‌ ఓ ప్రశ్న అడిగారు. దానికి పూజా హెగ్డే సమాధానమిస్తూ… ‘సె..’ అనే పదం వాడేసింది.‘చాలామంది మీరు ‘సె..’ ఎలా ఎంజాయ్‌ చేస్తారు అని అని… వెంటనే నాలుక కరుచుకుని సక్సెస్‌ అని మార్చింది. కానీ ఆ వీడియో బిట్‌ బయటకు వచ్చేసింది. దీంతో పూజకు విపరీతమైన ట్రోలింగ్‌ అవుతోంది.

నోరు జారడం, నాలుక కరుచుకోవడం అనేది నిజ జీవితంలో సహజం. ఇప్పుడు పూజను ట్రోలింగ్‌ చేస్తున్నవాళ్లు కూడా ఏదో సందర్భంలో ఇలా నోరు జారి సరి చేసుకున్నవాళ్లే. అయితే హీరోయిన్‌ కావడం, ఇలా టంగ్‌ స్లిప్‌ అవ్వడం… ఇబ్బందులు ప పెడుతోంది. ఈ విషయంలో కొంతమంది పూజను ఆడేసుకుంటుంటే, మరికొంతమంది అమె అలా టంప్‌ స్లిప్‌ అవ్వడం తెలిసి కూడా ఎలా వీడియో రిలీజ్‌ చేస్తారు అంటూ వీడియో రికార్డు చేసినవారిని తూర్పారబడుతున్నారు.

టాలీవుడ్‌లో పూజా హెగ్డే ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్శీలకు వెళ్లలేదు. ‘రాధేశ్యామ్‌’ విషయంలో హీరో హీరోయిన్ల మధ్య చిన్నపాటి గ్యాప్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఓ పాటలోని కొన్ని సీన్లను గ్రాఫిక్స్‌తో తీయాల్సి వచ్చిందని అని కూడా అంటున్నారు. కానీ ఇవేవీ నిజం కాదని ఈ మధ్య ఆమె ప్రెస్‌ మీట్లలో చెప్పకనే చెప్పింది. ప్రభాస్‌తో క్లోజ్‌గానే మూవ్‌ అయ్యినట్లు కనిపించింది. ఇప్పుడు ఈ వీడియోతో ఇబ్బంది పడింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus