Pooja Hegde: పారితోషికం తగ్గించిన పూజా హెగ్డే.. వరుస ఆఫర్లు వస్తాయా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ పరంగా కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు లేవనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నా ఆ ప్రాజెక్ట్ లలో పూజా హెగ్డేకు అవకాశం దక్కట్లేదు. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో మొదట హీరోయిన్ గా ఎంపికైన పూజా హెగ్డే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.

Pooja Hegde

ఆ తర్వాత పూజా హెగ్డే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని అభిమానులు భావించినా అందుకు భిన్నంగా జరిగింది. మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే రేసులో గతంతో పోల్చి చూస్తే వెనుకబడ్డారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ చివరి సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు పూజా హెగ్డే మరీ భారీగా పారితోషికం అయితే తీసుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

తమిళ, హిందీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఎక్కువ సంఖ్యలో ఆఫర్లను అందుకోవడంలో ఫెయిలవుతున్నారు. పూజా హెగ్డే తెలుగులో ఎప్పుడు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. సోషల్ మీడియాలో మాత్రం పూజా హెగ్డేకు భారీ స్థాయిలో క్రేజ్ ఉండటం గమనార్హం. పూజా హెగ్డే వయస్సు ప్రస్తుతం 33 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

కెరీర్ విషయంలో పూజా హెగ్డే ఆచితూచి అడుగులు వేయాలని కచ్చితంగా సక్సెస్ సాధించే సినిమాలలో మాత్రమే ఆమె నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పూజా హెగ్డే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సీరియల్ నటుడి ప్రేమలో ఈ బ్యూటీ ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లపై పూజా హెగ్డే ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

దేవర సీక్వెల్ గురించి కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus