Koratala Siva: దేవర సీక్వెల్ గురించి కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు!

దేవర1 (Devara) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా కథ, కథనం, సెకండాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి. దేవర సినిమాను రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంగా తెరకెక్కించి ఉంటే బాగుండేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. అయితే దేవర సీక్వెల్ గురించి కొరటాల శివ (Koratala Siva)  మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అంచనాలు పెంచేలా కొరటాల చేస్తున్న కామెంట్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దేవర సీక్వెల్ ఒకింత భారీ స్థాయిలో ఉండేలా కొరటాల శివ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.

Koratala Siva

దేవర సీక్వెల్ లో మరి కొందరు బాలీవుడ్ స్టార్స్ ఉండే ఛాన్స్ ఉందని కొరటాల శివ తెలిపారు. ఇది జరుగుతుందో లేదో నాకు మాత్రం తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. దేవర సీక్వెల్ లో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) , రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) ఉంటే బాగుంటుందని ఆయన కామెంట్లు చేశారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమేనని కొరటాల శివ పేర్కొన్నారు. ఇది జరుగుతుందో లేదో తెలియకుండా ఎక్కువ విషయాలు పంచుకోనని ఆయన తెలిపారు.

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల పేర్లు చెబితే ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలవుతాయని ఆయన వెల్లడించారు. దేవర సీక్వెల్ లో గెస్ట్ రోల్స్ ఉంటాయని అవి సినిమాలో చాలా కీలకమైనవని అతి త్వరలోనే వాటి వివరాలను ప్రకటిస్తానని ఆయన అన్నారు. దేవర సీక్వెల్ పై ఆకాశమే హద్దుగా అంచనాలను పెంచేస్తున్న కొరటాల శివ ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

దేవర సీక్వెల్ లో ప్రతి పాత్రలో ట్విస్ట్ ఉంటుందని చెబుతున్న కొరటాల సీక్వెల్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. దేవర సక్సెస్ తో సీక్వెల్ పై బాధ్యత పెరిగిందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

బన్నీ ఎంట్రీతో ఆ వివాదాలకు పూర్తిస్థాయిలో చెక్ పడుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus