టైం అనేది ఎప్పుడు, ఎవరిని, ఎలా మార్చుతుందో చెప్పడం కష్టం. మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాల్సిన ఓ బుల్లితెర నటి ఇంట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడమే తరువాయి అనుకుంటున్న సమయంలో బుల్లితెర నటి పూజా మూర్తి తండ్రి చనిపోయారు. ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తనను అల్లారు ముద్దుగా పెంచి పోషించిన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో పూజా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.
తండ్రి ఇక లేరనే విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరవుతోంది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. వీలైతే తిరిగి వచ్చేయండి నాన్నా అంటూ బతిమలాడుకుంది. ‘RIP.. ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతున్నాను. నాకు తెలిసినంత వరకు నిన్ను గర్వపడేలా చేశాను అని అనుకుంటున్నాను. తెలిసో, తెలియకో ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించు నాన్నా. నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆశీస్సులు నాకు, అమ్మకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను.
నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఈ మేరకు తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. పూజా మూర్తి కన్నడ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘గుండమ్మ కథ’తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అటు యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించిన ‘సూపర్ క్వీన్’ షోలో పాల్గొంది. చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న పూజకు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం లభించింది.
పూజా (Actress) బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. షోలో ఎంట్రీ ఇచ్చేందుకు చక్కగా డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసింది. మరికొద్ది గంటల్లోనే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుంది అనుకుంటున్న సమయంలో ఈ విషాదం జరిగింది. తండ్రి అకాల మరణంతో ఆమె ఈ షోకు రాలేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పాపం అంటున్నారు. ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?