సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం క్యాస్టింగ్ కౌ..చ్. చాలామంది హీరోయిన్లు ఇలాంటి అడ్డంకులు దాటుకుని వచ్చినవారే. ఈ గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి వెండితెరపై ఒక వెలుగు వెలిగిపోవాలన్న కోరికతో ఎంతోమంది యువతలు ఎన్నో ఇబ్బందులు పడతారు. అయితే కొన్ని ఏజెన్సీలు.. కొందరు మీడియేటర్లు.. కొందరు బ్రోకర్లు తాము అడిగింది ఇస్తే.. తాము చెప్పినట్టు వింటే.. తాము చెప్పినట్టు చేస్తే అవకాశాలు ఇస్తామని మభ్యపెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిని కూడా ధైర్యంగా దాటుకుని ముందుకు వచ్చిన వారు కొందరు ఉంటే…
మరికొందరు వీళ్ళ ఉచ్చులో పడి కెరీర్ నాశనం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే తాను కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని అంటుంది యంగ్ హీరోయిన్ ప్రాచీ ఠాకర్. రాజు గారి కోడి పలావ్ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రాచీ తన తాజా ఇంటర్వ్యూలో చిన్నప్పటి నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని.. చదువుకునే రోజుల్లో పటాస్ సినిమా చేశానని చెప్పింది. తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ తనను సంప్రదించడంతో తనకు తెలుగు రాక తెలుగు స్నేహితుడిని మీడియేటర్ గా పెట్టుకున్నాను అని తెలిపింది.
ఆ ఏజెన్సీ వాళ్ళు అడ్వాన్స్ చెక్కు కూడా ఇచ్చారని.. ఆ వ్యక్తి నా నెంబర్ తీసుకుని కమిట్మెంట్ ఇస్తున్నారు కదా అనడంతో అడ్వాన్స్ ఇచ్చారు కదా ఎప్పుడు ?షూటింగ్ ఉంటే ఆ రోజే కమిట్మెంట్ ఇస్తానని చెప్పానని.. అయితే సదరు వ్యక్తి కమిట్మెంట్ కు నువ్వు రెడీ కదా అని అడిగాడు అని చెప్పింది. అతడు అన్నది నాకు అర్థం కాకపోవడంతో అతడు అది కాదు నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు నీకు రెండు లక్షలు ఇస్తా…
అతడితో నైట్ కాంప్రమైజ్ అవుతావా ? అని అడిగాడని.. నాకు (Actress) అర్థం కాక ఆ సంభాషణ స్క్రీన్ షాట్ తీసి నా స్నేహితురాలికి పంపించానని.. అప్పుడు ఆమె అంతా వివరంగా చెప్పడంతో అసలు విషయం అర్థమైందని ప్రాచీ తెలిపింది. ఈ సంఘటన జరిగాక నాకు చాలా బాధ వేసింది.. ఆ యాడ్ కూడా వదులుకున్నానని ప్రాచీ తెలిపింది.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!