Actress Pragathi: నా భర్తతో కలిసుండాలని చాలా ట్రై చేశాను … కానీ విడాకులు తీసుకోక తప్పలేదు : ప్రగతి

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రలతో బాగా ఫేమస్ అయ్యింది. అయితే లాక్ డౌన్ టైం లో ఈమె పేరు మార్మోగిపోయింది అని చెప్పాలి. లాక్ డౌన్ టైంలో హీరోయిన్స్ మాదిరి జిమ్లో వర్కౌట్లు చేయడం, మాస్ పాటలకు డాన్స్ వీడియోలు చేయడం, అందాలు కనిపించేలా ట్రెండీ దుస్తుల్లో కనిపించడం ఒక్కటేమిటి… ఈమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

లాక్ డౌన్ టైంలో ఈమె సోషల్ మీడియా ఖాతాలకు కూడా ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఈమె డిమాండ్ మామూలుగా ఏర్పడలేదు. నితిన్ తో కలిసి ఓ యాడ్ లో నటించిన ప్రగతి ఏకంగా తన పారితోషికాన్ని కూడా పెంచేసిందట. ఇందుకు కారణం లాక్ డౌన్ టైంలో షూటింగ్స్ లేక అప్పుల్లో కూరుకుపోవడమే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇదే ఇంటర్వ్యూలో తనని ఆంటీ అంటే కోపం వస్తుంది అని కూడా తెలిపింది. అలాగే తన విడాకులకు కారణాలు కూడా చెప్పుకొచ్చింది ఈ సీనియర్ బ్యూటీ.

ప్రగతి ఈ విషయంపై స్పందిస్తూ.. “నాకు నా పిల్లలే ప్రపంచం. మగాడి అండ లేకుండా నేనే ఒంటరిగా పోరాటం చేసి నా పిల్లల్ని చదివించుకున్నాను. ఈరోజు వాళ్ళ కెరీర్ కోసం సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగారు.అదే నా సక్సెస్ గా భావిస్తాను. అయితే మా అమ్మ గారు సింగిల్ గా జీవించారు కదా.. అని నేను సింగిల్ గా ఉండకూడదు అని నా భర్తతో నేను కలిసి ఉండడానికి చాలా కష్టపడ్డాడు. కానీ నా కష్టం ఫలించలేదు. అందుకే విడాకులు తీసుకున్నాను.

నా పిల్లల చదువు విషయంలో నా వరకు ఎంత చేయాలో అంత చేశాను. కానీ పెళ్లి విషయంలో మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను. అది పూర్తిగా వాళ్ళ నిర్ణయం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రగతి హీరోయిన్ గా నటిస్తున్న టైంలో ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లయింది. ఆ తర్వాత ఈమె నటనకు దూరమైంది. అయితే ఈమె మ్యారీడ్ లైఫ్ సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని ఈమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus