సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రేమ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు..! వెంకటేష్- సురేష్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘ధర్మచక్రం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ అటు తర్వాత ‘కోరుకున్న ప్రియుడు’, ‘ఓంకారం’, వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అయితే ‘దేవి’ సినిమా ఈమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ ఒక్క సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ తర్వాత సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమైంది.
అందువల్ల ఈమె తన స్టార్ డంని కాపాడుకోలేకపోయింది. ‘రాయలసీమ రామన్న చౌదరి’ ‘చిరునవ్వుతో’ ‘ఢీ’ వంటి చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసింది కానీ.. అవి ఈమెకు కలిసిరాలేదు. ఇక అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్న టైంలో జీవన్ అప్పచ్చు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.2006 లో వీరి వివాహం జరిగింది. కానీ వీరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో 2016 లో వీళ్ళు విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయారు.
ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంటుంది అన్నారు.. కానీ అందులో నిజం లేదని (Prema) ఈ బ్యూటీ తెలిపింది. తాజాగా ఈ విషయాల పై ఆమె మరోసారి మాట్లాడుతూ.. “నా జీవితంలో పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లోకి తీసుకు రాను.. నాకు నచ్చలేదు అంటే దాన్ని పూర్తిగా ఖండిస్తాను. నా వైవాహిక జీవితంలో కూడా అదే జరిగింది.. నాకు ఉన్న ఇబ్బందులు నా కుటుంబానికి చెప్పి విడాకులు తీసుకున్నాను.
ఇక రెండో పెళ్లిపై రకరకాల గాసిప్స్ వినిపించాయి. అవి ఎలా పుట్టిస్తారో వారికే తెలియాలి. ప్రస్తుతం నేను బెంగుళూరులో ఒంటరిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఎలాంటి వదంతులు నమ్మకండి. ఇండస్ట్రీలో నాకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను” అంటూ ప్రేమ చెప్పుకొచ్చింది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!