Priyanka Chopra: సర్జరీ కారణంగా సినిమా అవకాశాలు కోల్పోయాను!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోయిన్స్ అవకాశాలు అందుకోవాలంటే నటన నైపుణ్యంతో పాటు అందం కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అందంగా ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాలు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలోనే అందం కాపాడుకోవడం కోసం సెలబ్రిటీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక మరికొందరైతే పెద్ద ఎత్తున వారి శరీర భాగాలకు సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా కూడా ఇలా తన పెదాలకు ముక్కుకు సర్జరీ చేయించుకున్నట్లు స్వయంగా ఆమె వెల్లడించారు.

అయితే 20 సంవత్సరాల క్రితం తాను తన ముక్కుకి పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు తెలియజేశారు. అయితే పెదాల సర్జరీ సెట్ అయినప్పటికీ ముక్కుకు చేయించుకున్న సర్జరీ మాత్రం ఫెయిల్యూర్ అయిందని దానివల్ల తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అంటూ ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియాంక చోప్రా ఒకానొక సమయంలో తాను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే దానిని జలుబు వచ్చినా కూడా తనకు వెంటనే తగ్గేది కాదు అంటూ ప్రియాంక వెల్లడించారు అయితే డాక్టర్ వద్దకు వెళ్ళగా నాసిక కుహరంలోని పాలిప్ అనే భాగాన్ని తొలగించాలని చెప్పారు.

అయితే ముక్కు పైన ఉన్న చిన్న భాగాన్ని సర్జరీ చేసి తొలగించారు దీంతో తనలో బాగా మార్పులు కనిపించాయని చెప్పారు. అప్పటికే తాను రెండు మూడు సినిమాలకు సాయం కూడా చేశానని కానీ నా శరీరంలో మార్పులు రావటం వల్లే ఆ సినిమాల నుంచి తొలగించారని ఒకానొక సమయంలో ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని ప్రియాంక చోప్రా వెల్లడించారు.

ఇలా అవకాశాలు తగ్గిపోతున్న క్రమంలో (Priyanka Chopra) తన సినీ కెరియర్ ముగిసిందని ఆందోళన చెందుతూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని అయితే ఆ సమయంలో తన తండ్రి అండగా నిలిచి ముక్కును సరి చేసుకోవడం కోసం కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారని ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus