ప్రియుడిని పెళ్లాడిన నటి.. ఫోటోలు వైరల్!

కార్తీక మాసం ఎండింగ్ కి వచ్చింది. ఇంకో విధంగా నవంబర్ కూడా ఎండింగ్ కి వచ్చింది అని చెప్పవచ్చు. మరోపక్క పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. డిసెంబర్ నెల ఎండింగ్ వరకు పెళ్లిళ్ల సీజన్ అంటూ పెద్దలు చెబుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా పెళ్లిపీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi)  రెండో పెళ్లి చేసుకున్నాడు. అటు తర్వాత సింగర్స్ అనురాగ్ కులకర్ణి  (Anurag Kulkarni), రమ్య బెహరా(Ramya Behara)..లు ప్రేమ వివాహం చేసుకున్నారు.

Puja Joshi

తాజాగా టాలీవుడ్ నటుడు సుబ్బరాజు (Subbaraju)  కూడా తన ప్రేయసిని సైలెంట్ గా వివాహం చేసుకుని ఫోటోలు షేర్ చేశాడు. మరోపక్క అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)  కూడా డిసెంబర్ 4 న పెళ్లి చేసుకోబోతున్నాడు. అఖిల్  (Akhil) కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో నటి సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఫోటోలు షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాతి నటి పూజ జోషి (Puja Joshi) చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. కొంతకాలంగా ఈమె ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

అతని పేరు మల్వార్ ధాకర్ అని కూడా వార్తలు వచ్చాయి. కానీ పూజ జోషి.. ఈ విషయంపై ఓపెన్ అవ్వలేదు. కానీ ఫైనల్ గా అతన్నే పెళ్లి చేసుకుంటున్నట్టు ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించి.. గతంలో వచ్చిన గాసిప్పులు నిజం చేసింది.మరోపక్క ఆమె చాలా సైలెంట్ గా మల్వార్ ధాకర్ ని పెళ్లి చేసుకుని ఇంకో షాకిచ్చింది. తన పెళ్లి ఫోటోలు షేర్ చేసి మరీ పూజ జోషి ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మయోసైటిస్‌.. ఎప్పుడు తెలసిందంటే.. తొలినాళ్లలో ఎలా?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus