తెలుగులో పవన్ కళ్యాణ్ ‘గోకులంలో సీత’ చిరంజీవి ‘ఇంద్ర’ తనీష్ ‘నచ్చావులే’ వంటి చిత్రాల్లో నటించింది రక్ష. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ‘నచ్చావులే’ సినిమాలో హీరో తల్లిగా నటించినందుకు ఈమెకి నంది అవార్డు కూడా దక్కింది. ఇటీవల ఆమె ఓ షో లో పాల్గొంది. ఈ షో లో ఆమె జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది. రక్ష మాట్లాడుతూ… “నా తండ్రి నిర్మాతగా రెండు సినిమాలు తీసి నష్టపోయాడు. అందుకోసమే నేను సినిమాల్లోకి వచ్చాను.
ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకపోయినా.. నాకు నచ్చి నటిగా కెరీర్ మొదలుపెట్టాను. అయితే నాతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే అసలు ఊరుకోను. అయినా హద్దు మీరిన చాలా మందికి నా చేతుల్లో దెబ్బలు తగిలాయి. ఒకానొక సమయంలో.. ఓ డైరెక్టర్ చెంప పగలగొట్టాను. ఆ డైరెక్టర్ కథ చెప్పినప్పుడు గ్లామర్ పాత్రల్లో నటించను, నాకు పెళ్లైంది, కూతురు కూడా ఉంది అని ముందే చెప్పను. స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోనని కూడా చెప్పను. మొదటి ఆ డైరెక్టర్ ఓకే చెప్పాడు. తరువాత సెట్ కి వెళ్తే ఆ డైరెక్టర్ తేడాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా పొగడడం, పదే పదే ఏదో రకంగా విసిగించడం చేస్తుండడంతో ‘ఒరేయ్ ఇలా రారా’ అని పిలిచి చెంపమీద లాగిపెట్టి కొట్టాను. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామనుకున్నాను. కానీ ఆ చిత్రం హీరో వచ్చి.. ‘వద్దు మేడం.. సినిమా ఆగిపోతుందని’ బ్రతిమాలితే వదిలేసాను” అంటూ చెప్పుకొచ్చింది.