Rakul Preet: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నటి రకుల్… అసలేం జరిగిందంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలకు గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం సర్వసాధారణం ఇలా ఎంతోమంది నటి మనలో నిత్యం ఇలాంటి పుకార్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రకుల్ ప్రీతిసింగ్ 2021 వ సంవత్సరంలో ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నాననే విషయాన్ని అందరితో పంచుకున్నారు. ఈ విధంగా రకుల్ ప్రీతిసింగ్ ప్రేమలో ఉన్నాను అని ప్రకటించడంతో

ఈమె పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక రకుల్ ప్రీతిసింగ్ ఏదైనా సినిమా ఈవెంట్ల నిమిత్తం బయటకు వచ్చిన మీడియా వెంటనే తన పెళ్లి ఎప్పుడు అంటూ సమయం సందర్భం లేకుండా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా పలుమార్లు తన పెళ్లి గురించి ప్రశ్నించడంతో ఈ వార్తలపై రకుల్ ప్రీతిసింగ్ ఒకానొక సమయంలో అసహనం కూడా వ్యక్తం చేశారు.ఇలా రకుల్ ప్రీతిసింగ్ పెళ్లి గురించి తరచూ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.

ఈమె సోదరుడు ఆమన్ వచ్చే ఏడాది మా అక్క పెళ్లి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తరచూ ఈమె పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తరచూ తన పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు ఇలా వారానికి ఒకసారి నా పెళ్లి గురించి ఎన్నో పుకార్లు వస్తున్నాయి.

మీ కథనాల ప్రకారం నాకు గత ఏడాది నవంబర్ నెలలోనే పెళ్లి జరిగిపోయింది. ఇంతకీ నా పెళ్లి ఎప్పుడు ఎలా జరిగిందో నాకే చెప్పలేదు అంటూ సెటైర్స్ వేశారు. ఇలా పెళ్లి గురించి రకుల్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus