జపనీస్ బ్రాండ్ అడ్వకేట్ గా రష్మిక… సంతోషం వ్యక్తం చేస్తున్న నటి!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలా రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఈమె ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. పలు బ్యూటీ ప్రొడక్ట్స్ ట్రావెలింగ్ అలాగే జ్యువెలరీ వంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి రష్మిక తాజాగా మరొక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. తాజాగా ఈమె జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘Onitsuka Tiger’కి బ్రాండ్ అడ్వొకేట్‌ గా వ్యవహరించే అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. జపనీస్ బ్రాండ్ గురించి పోస్ట్ చేస్తూ.. “నేను మరో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఐకానిక్ జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘Onitsuka Tiger’కి నేను బ్రాండ్ అడ్వొకేట్‌ గా వ్యవహరించనున్నాను. ఇండియా నుండి ఈ గౌరవం అందుకున్న మొదటి వ్యక్తినేనే అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇలా ఈమె జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే పుష్ప సినిమా సీక్వెల్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus