Nithiin, Rashmika: మరోసారి రిపీట్ కానున్న భీష్మ కాంబినేషన్… ఈసారైనా నితిన్ హిట్ కొట్టేనా?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈయన నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. మాచర్ల నియోజకవర్గం సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈయన తన తదుపరి ప్రాజెక్టులపై మరింత శ్రద్ధ చూపుతున్నారు. ఈ సినిమా అనంతరం నితిన్ తరువాత ప్రాజెక్ట్ ను ఒక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా తర్వాత నితిన్ తన తర్వాతి ప్రాజెక్ట్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం భీష్మ. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వెంకీ కుడుముల మరోసారి ఇద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని భావించారట. ఈ క్రమంలోనే ఇప్పటికే వీరిద్దరికి స్టోరీ లైన్ వినిపించగా ఇద్దరికీ నచ్చి ఈ సినిమాకి కమిట్ అయ్యారని ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని సమాచారం.

త్వరలోనే ఈ సినిమా గురించి చిత్ర బృందం అధికారకంగా అన్ని విషయాలను కూడా తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి సిద్ధమయ్యారట. భీష్మ సినిమా తర్వాత డైరెక్టర్ వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయిందని దాంతో ఈయన రష్మిక నితిన్ తో కలిసి మరోసారి అద్భుతమైన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

అయితే వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చినటువంటి ఛలో సినిమా ద్వారా రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో భీష్మ సినిమాతో హిట్ అందుకున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus