Rashmika Mandanna: నాపై ఎందుకంత ద్వేషం… ఆవేదన చెందిన రష్మి.. పోస్ట్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి రష్మిక ఒకరు. ఈమె భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే సెలబ్రిటీలు అన్న తర్వాత వారి గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం అలాగే ఈ వార్తలపై నేటిజన్స్ ట్రోల్ చేయడం సర్వసాధారణం.అయితే కొంతమంది నటీమణులు వీటిని చూసి చూడనట్టు వదిలేస్తారు

కానీ మరి కొంతమంది వారి ఓపిక నశించి ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తన గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఎంతో ఓపికగా సహనంతో భరించిన రష్మిక తాజాగా తనపై వస్తున్నటువంటి ట్రోల్స్ గురించి స్పందిస్తూ ట్రోలర్స్ కు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ తన పట్ల నెగటివ్ కామెంట్లతో రెచ్చిపోయిన వారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రష్మిక తెలియజేస్తూ తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో సహనంతో ఉన్నాను అయితే రోజురోజుకి మరీ దిగజారి నా గురించి దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాటకు వ్యతిరేకంగా ట్రోల్ చేయడం ఎంతో బాధేస్తుంది. నటిగా నేను అభిమానులను సంతోష పెట్టడానికి నా వంతు కృషి చేస్తున్న నటిస్తున్నాను. సినిమాలపరంగా నా సినిమా నచ్చకపోతే నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పండి.

ఈ విధంగా నేను ఇంటర్వ్యూలలో మాట్లాడితే మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా ట్రోల్ చేయడం నన్ను ఎంతగానో బాధపెడుతుంది.ఇలా తన గురించి వచ్చే ట్రోల్స్ చూసినప్పుడు కొన్నిసార్లు నిరుత్సాహం కలుగుతుందని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నాపై మీకెందుకు ఇంత ద్వేషం అంటూ ప్రశ్నించారు. అయితే నేను మొదట్లోనే ఈ విషయాలను ఖండించకుండా తప్పు చేశాను ఇలాగే వదిలేస్తే మరింత దిగజారి పోతారంటూ ఈమె ఈ సందర్భంగా ట్రోల్స్ పై స్పందిస్తూ ట్రోలర్స్ కు షాక్ ఇచ్చారు.

ఈ విధంగా రష్మిక ఇంస్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేయడంతో ఎంతోమంది అభిమానులు రష్మిక తన గురించి విజయ్ దేవరకొండ గురించి వస్తున్నటువంటి స్పందించి ఇలాంటి కామెంట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్ట్ గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus