Rashmika: ఫిట్ నెస్ గురించి ఫిలాసఫీలు చెబుతున్న రష్మిక మందన్న?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన్న అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా కన్నడ తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా హిందీ భాషలో కూడా అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తన గురించి ట్రోల్ చేసేవారికి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చిన ఈమె తాజాగా ఫిట్నెస్ గురించి ఫిలాసఫీలు చెబుతూ వర్కౌట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె తన ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ..

తన మూడు ఎలా ఉన్నా సరే వర్కౌట్ చేస్తే మాత్రం తనకు చాలా సంతోషంగా ఉంటుందని ఈమె వెల్లడించారు. తాను కోపంలో ఉన్న బాధలో ఉన్న సరే వర్కౌట్స్ మాత్రం తప్పకుండా చేస్తానని ఇలా వర్కౌట్ చేయడం వల్ల ఆ బాధ నుంచి తొందరగా బయటపడతానని తెలియజేశారు. ఈ విధంగా తాను వర్కౌట్ చేయడంతో ఫిట్నెస్ మాత్రమే కాకుండా ఎంతో సంతోషంగా కూడా ఉన్నానని తెలియజేశారు.

మీరు కూడా ఇప్పటివరకు ఎవరైనా ఇలాంటి వర్కౌట్స్ చేయకపోతే వెంటనే చేయండి మీలో కలిగే మార్పులను గమనించండి అంటూ ఇన్స్టాగ్రామ్ లేదు కదా తన ఫిట్నెస్ గురించి అలాగే వర్క్ అవుట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలియజేశారు. ఇలా ఈమె పోస్ట్ చేయడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus