Raveena Tandon: ప్రెగ్నెన్సీ టైంలో ‘కె.జి.ఎఫ్’ నటి రవీనా టాండన్ కు ఎదురైన చేదు అనుభవం..!

రవీనా టాండన్ ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడైతే పలు టీవీ షోలు, కథా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇటీవల విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రంలో ప్రధాన మంత్రి రమికా సేన్ గా పవర్ ఫుల్ పాత్రని పోషించింది. ఇదిలా ఉండగా.. నార్త్ లో సౌత్ సినిమాలు సూపర్ హిట్ అవుతుండడంతో అక్కడి ఫిలిం మేకర్స్ కు అలాగే క్రిటిక్స్ కు మన సినిమాల పై, మన నటీనటుల పై ఏడుపు ఎక్కువైపోయింది.

దీంతో సౌత్ ఫిలిం మేకర్స్ బడ్జెట్ పెట్టడం తప్ప ఇంకేమి ఆలోచించరు అనే కామెంట్స్ వచ్చాయి. అందుకు బాలీవుడ్ నటి అయిన రవీనా టాండన్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. సౌత్ జనాలకి సినిమా పై ఉన్న ప్రేమతో ఖర్చు పెడుతున్నారు. అందువల్లే ఆ సినిమాలకు మంచి మార్కెట్ అవుతుంది. కలెక్షన్లు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది. అలాగే గతంలో ఆమెకి ఎదురైన ఓ చేదు అనుభవం గురించి కూడా ఈమె వెల్లడించింది.

‘నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బరువు పెరిగాను. డెలివరీ అయిన కొన్నాళ్ళకి వర్కౌట్లు చేసి సన్నబడ్డాను. అయితే అప్పటికే నా పై బాడీ షేమింగ్ కామెంట్స్ తో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. ఓ జర్నలిస్ట్ అయితే ‘మీరు బరువు పెరగడం వల్లనే కదలకుండా ఉండడానికి టీవీ షోలను ఎంపిక చేసుకుంటున్నారా?’ అంటూ కామెంట్స్ చేశాడు. అందుకు నేను.. ‘వర్కౌట్లు చేసి బరువు తగ్గుతా.. తగ్గగలను.. నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో చెప్పు అన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది రవీనా. ప్రస్తుతం ఈమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus