గురూజీ మీ చల్లని చూపులు మాకు లేవా… నటి పోస్ట్ వైరల్!

  • February 27, 2023 / 02:48 PM IST

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్లలో నటి సంయుక్త మీనన్ ఒకరు. ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ కు చెల్లెలుగా రానా భార్య పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఇక తాజాగా ధనుష్ తో కలిసి సార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు.

ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సంయుక్త మీనన్ గురించి ప్రముఖ తెలుగు నటి రేఖా భోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈమె నటించిన భీమ్లా నాయక్ సార్ సినిమాలకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాకపోయినా ఈ సినిమాల విషయంలో ఈయన పాత్ర చాలా ఉందని చెప్పాలి. ఇక మాటల మాంత్రికుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు

ఎంతో అద్భుతంగా తీస్తారనే పేరు ఉన్నప్పటికీ ఈయన హీరోయిన్లతో అఫైర్స్ కూడా పెట్టుకుంటారనే వార్తలు పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.ఇప్పటికే ఈయనకు పూజా హెగ్డేకు మధ్య ఎఫైర్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సార్ బ్యూటీతో కూడా త్రివిక్రమ్ ఎఫైర్ కొనసాగిస్తున్నారు అంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ నటి సంయుక్త మీనన్ మధ్య ఎఫైర్ ఉందంటూ

నటి రేఖ ఓపెన్ కామెంట్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రేఖ స్పందిస్తూ చాలా కష్టపడుతున్నాను గురూజీ ఆ మల్లు మీనన్ మాత్రమే కాదు.. కాస్త మాపై కూడా మీ చల్లని చూపు, దయ చూపండి అంటూ పరోక్షంగా సంయుక్త మీనన్ త్రివిక్రమ్ మధ్య ఉన్నటువంటి ఎఫైర్ గురించి ఈమె ఓపెన్ కామెంట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus