అప్పుడెప్పుడో వచ్చిన “ఈ రోజుల్లో” సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి రేష్మకు ఆ సినిమా హిట్ అవ్వడంతో మంచి ఆఫర్లే దొరికాయి. కాకపోతే.. అమ్మడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన కెరీర్ ఇంకా పూర్తిగా మొదలవ్వకుండానే ముగిసిపోయింది. దాంతో అమ్మడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఓ ఏరియా నుంచి భారతీయ జనతా పార్టీ నతరపున పోటీ చేసింది రేష్మ. నిన్న వచ్చిన రిజల్ట్స్ లో దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. టి.ఆర్.ఎస్ జోరు ముందు రేష్మ గ్లామర్ జనాల్ని ఏమాత్రం ఆకర్షించలేకపోయింది.
కేవలం రేష్మ మాత్రమే కాదు ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిద్దామని ప్రయత్నించిన భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ కానీ.. బాబు మోహన్ కానీ జనాల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. దాంతో భారీ స్థాయిలో ఓడిపోయారు. బాబు మోహన్, ఆనంద్ ప్రసాద్ లకు ఇప్పుడు ఓడిపోవడం వలన పెద్దగా నష్టం ఏమీ లేదు కానీ.. ఒకపక్క సినిమాల్లోనూ నెగ్గుకురాలేక, ఇప్పుడు రాజకీయాల్లోనూ నెగ్గలేక నానా బాధలు పడుతోంది. మరి ఆమె ఓడిపోయినా రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతుందా లేక సైలెంట్ గా మళ్ళీ సినిమాల్లోకి వచ్చేస్తుందా అనేది చూడాలి.