Richa Gangopadhyay: తల్లైన మిర్చి బ్యూటీ!

కొంతమంది హీరోయిన్స్ తక్కువ కాలమే సినిమా ఇండస్ట్రీలో కొనసాగినప్పటికీ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకానొక సమయంలో మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన గ్లామర్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేది. పెళ్లి అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇక చాలా కాలం తరువాత అమ్మడు ఒక గుడ్ న్యూస్ చెప్పింధి.

తన ఫ్యామిలీ సంఖ్య పెరిగింది అంటూ పండంటి మగా బిడ్డకు జన్మనిచ్చినట్లు క్లారిటీ ఇచ్చేసింది. మా చిరు ఆనందం లుకా షాన్‌ మే 27న జన్మించాడని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. కొడుకు పోటోలను కూడా షేర్ చేసింది. అచ్చం తన తండ్రి లాగే ఉన్నాడని ఆనందం వ్యక్తం చేసింది. ఇకరీచా తనయుడి ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఇక బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ లో పరిచయమైన బాయ్ ఫ్రెండ్ జో ను పెళ్లి చేసుకున్న రిచా 2019లో పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యింది.

మొదట లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత మిరపకాయ్, మిర్చి వంటి సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకుంది. ఇక పెళ్లి తరువాత ఫ్యామిలీ లైఫ్ కు ప్రాముఖ్యత ఇచ్చిన ఈ బ్యూటీ అవకాశాలు వస్తున్న తరుణంలోనే సినిమాలకు దూరమయ్యింది.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus