Actress Roja: తన భర్త సెల్వమణి పై రోజా కామెంట్స్ వైరల్..!

బుల్లితెర పై కామెడీ షోలు ఎన్ని వచ్చినా ‘జబర్దస్త్’ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఈ షోకి వైసీపి ఎమ్మెల్యే రోజా, సింగ‌ర్ మ‌నోతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆపకమింగ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది.ఈ ప్రోమోలో రోజా త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణి సెటైర్లు వేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. క‌మెడియ‌న్ నూక‌రాజు రోజా, సెల్వ‌మ‌ణిల‌ జంటని ఉద్దేశిస్తూ ఓ సెటైర్ వేయడం జరిగింది.

Click Here To Watch

‘రోజా ఇంటికి కొత్తింటికి వెళ్ళి చూస్తున్న టైములో ‘రోజా వ‌స్తోంద‌ని దాక్కుని పరిస్థితిని గమనిస్తారు’. ఇది తెలుసుకున్న రోజా పాత్ర‌దారి కోపంగా చూస్తూ… ” అబ్బాయిల‌కు అన్యాయం జ‌రిగితే అర‌గంట లేటుగా వస్తానేమో కానీ అమ్మాయిల‌కు అన్యాయం జ‌రిగితే మాత్రం అర‌నిమిషం కూడా లేట్ చేయను’ అంటూ ఓ డైలాగ్ చెబుతుంది. ఈ క్రమంలో నూక‌రాజు ఎంట్రీ ఇచ్చి ‘నా నోరు లాగుతుంది.. రోజా అందంగా వుంది’ ‘నేనే సెల్వ‌మ‌ణి’ అంటూ పంచ్ డైలాగ్ చెబుతాడు.

దీనికి రోజా ఆశ్చర్యపోయి నవ్వుకుని నూక‌రాజుని అభినందిస్తుంది.తర్వాత రోజా మాట్లాడుతూ ‘నా భర్త సెల్వ‌మ‌ణి ‘రేసుగుర్రం’లో శృతిహాస‌న్ లాంటోడు. అన్నీ లోప‌లే దాచుకుంటాడు, బ‌య‌ట‌కి అస్సలు చెప్పడు’ అంటూ తన భర్త గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా.. ‘స్కిట్ లో చెప్పిన డైలాగ్ లు పేప‌ర్ పై రాసి ఇవ్వు’ ఇంటికెళ్లాక సెల్వ‌మ‌ణితో చెప్పించుకుంటాను’ అంటూ ఫన్నీ కామెంట్ కూడా చేసింది. రోజా డైలాగులతో స్టేజి పై ఉన్న వాళ్ళంతా షాకయ్యారు. ప్రస్తుతం రోజా.. సినిమాల్లో కూడా సహాయ నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus