Roja, Mahesh Babu: మహేష్ పై ప్రశంసల వర్షం కురిపించిన రోజా!

  • March 7, 2022 / 10:00 AM IST

సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ టాలీవుడ్ స్టార్ హీరో వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మహేష్ బాబు సామాజిక కార్యక్రమాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. 1,000కుపైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడం ద్వారా మహేష్ బాబు వార్తల్లో నిలిచారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాను హీరోనని మహేష్ ప్రూవ్ చేసుకున్నారు.

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు వైద్య సేవలను అందించడం ద్వారా మహేష్ బాబు మంచి మనస్సును చాటుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ను ప్రారంభించడంతో పాటు ఈ ఫౌండేషన్ ను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన హృదయానికి పిల్లలు ఎప్పుడూ దగ్గరగా ఉంటారని మహేష్ బాబు కామెంట్లు చేశారు. కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు ఈ ఫౌండేషన్ ద్వారా సాయం అందిస్తామని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడే చిన్నారులకు చికిత్స అందేలా చర్యలు చేపడుతూ మహేష్ బాబు తన స్థాయిని మరింత పెంచుకుంటున్నారు. మహేష్ చేస్తున్న మంచి పనులను సెలబ్రిటీలు సైతం ప్రశంసిస్తున్నారు. ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్యే రోజా మహేష్ బాబుకు హ్యాట్సాఫ్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేష్ బాబుకు హ్యాట్సాఫ్ అంటూ రోజా ట్వీట్ చేయగా ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

రోజా చేసిన ట్వీట్ కు 4,000కు పైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. మే నెల 12వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus