చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఈవెంట్ లో భాగంగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఏపీ రాజకీయ ప్రముఖులు చిరంజీవిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యాయి. అయితే చిరంజీవి చేసిన కామెంట్ల గురించి తాజాగా రోజా కౌంటర్లు ఇవ్వగా ఆ కౌంటర్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. రోజా మాట్లాడుతూ చిరంజీవి గారు ఏ సందర్భంలో మాట్లాడారో తనకు తెలియదని అన్నారు.
సీఎం జగన్ తో పాటు మంత్రులెవరూ రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదని ఆమె పేర్కొన్నారు. సినిమాకు ఇచ్చే పారితోషికం గురించి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకుంటారని రోజా అన్నారు. మేము కూడా ఆర్టిస్టులమని సినిమాలు చేసే సమయంలో వాటికే పరిమితం కావాలని ఆమె కామెంట్లు చేశారు. రాజకీయాల్లో ఉంటే అవే చూసుకోవాలని రోజా అన్నారు. సినిమా వేదికలపై రాజకీయాలను ముడిపెట్టి ప్రభుత్వంపై పవన్ దుమ్మెత్తిపోస్తున్నాడని ఆమె పేర్కొన్నారు.
చిరంజీవి ఏదైనా సలహా ఇవ్వాలని అనుకుంటే పవన్ కు ఇస్తే బాగుంటుందని బ్రో మూవీలో అంబటి పాత్రను పెట్టి అవమానించారని రోజా చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా, సంక్షేమం గురించి జగన్ ఆలోచించాలని చిరంజీవి అంటున్నారని ఆమె అన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందని రోజా కామెంట్లు చేశారు. ఆ సమయంలో ప్రత్యేక హోదా కోసం మీరెందుకు పోరాడలేదని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చిరంజీవి లబ్ధి పొందారని రోజా (Roja) పేర్కొన్నారు.
చిరంజీవి చెబితే విని చేయాలనే స్థితిలో జగన్ లేరని ఆమె చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజ్ తీసుకుని పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రోజా అన్నారు. చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండి తమ్ముడికి బుద్ధి చెప్పడం మానేసి రాజకీయాలు మాట్లాడటం సరికాదని రోజా పేర్కొన్నారు. రోజా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజా కామెంట్లపై మెగాస్టార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!