తరుణ్ తల్లి రోజారమణి భావోద్వేగపు కామెంట్స్ వైరల్!

ఒకప్పటి హీరోయిన్ రోజారమణి అందరికీ సుపరిచితమే. ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లా, రాజమండ్రికి చెందిన ఈమె 1967 లో వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో ప్రహ్లాద పాత్రని పోషించింది. ఆ సినిమాలో తన పాత్రకు గాను ‘బెస్ట్ చైల్డ్ యాక్టర్’ కేటగిరిలో నేషనల్ అవార్డు అందుకుంది. అటు తర్వాత నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా చాలా పాపులర్ అయ్యింది. రోజారమణికి.. చెంపార్తి శోభన అనే మరో పేరు ఉంది. తెలుగుతో పాటు మలయాళం సినిమాల్లో కూడా ఈమె నటించి అక్కడ కూడా క్రేజ్ ను సంపాదించుకుంది.

రోజారమణి కొడుకు తరుణ్ కూడా అందరికీ సుపరిచితమే. ఇతను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పలు పెద్ద సినిమాల్లో నటించాడు. అటు తర్వాత హీరోగా కూడా మారి ‘నువ్వే కావాలి’ ‘ప్రియమైన నీకు’ ‘నువ్వులేక నేనులేను’ ‘నువ్వే నువ్వే’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఆ తర్వాత రాణించలేక తొందరగానే ఫేడౌట్ అయిపోయాడు. ఇదిలా ఉండగా… తరుణ్ మొదట మణిరత్నం తెరకెక్కించిన ‘అంజలి’ సినిమా ద్వారా తమిళ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమాతోనే ఇతను కూడా నేషనల్ అవార్డు అందుకున్నాడట. అచ్చం తన తల్లిలాగే అన్న మాట. ఆ టైంలో తరుణ్ తల్లి రోజారమణి ఏడ్చేశారట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “అంజలి సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యింది. నేను, నా భర్త చాలా సంతోషపడ్డాం.అయితే ఒకరోజు టీవీలో న్యూస్ చూస్తున్న టైంలో నేషనల్ అవార్డ్స్ ప్రకటన వచ్చింది. అమితాబ్ బచ్చన్, విజయశాంతి అంటూ ఎవరెవరో స్టార్ల పేర్లు చెబుతున్నారు.

ఆ టైంలో ‘అంజలి’ సినిమాలో నటించిన ముగ్గురికి నేషనల్ అవార్డ్స్ అంటూ మొదటి పేరు తరుణ్‌ది చదివారు. మాస్టర్ తరుణ్, బేబీ శృతి, బేబీ షామిలి అని ఆర్డర్ లో చదవడం చూశాము. అది రిపీట్ చేసి వినే సదుపాయం మనకు లేదు కదా. నిజమా కాదా అనేది అర్థం కాక… వెంటనే మణిరత్నం గారి కో-డైరెక్టర్ పానీ గారికి ఫోన్ చేసి ఆరా తీశాం. అప్పుడు ఆయన ‘హ్యాపీనా’ అన్నారు. ఆ క్షణం ఇద్దరం ఏడ్చేశాం’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు రోజారమణి

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus