జబర్దస్త్ జడ్జిగా, నటిగా, ఎమ్మెల్యేగా పాపులారిటీని సంపాదించుకున్న రోజా కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేసి పలు సందర్భాల్లో మంచి మనస్సును చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా రోజా ట్విట్టర్ ద్వారా ఒక శుభవార్తను విన్నానంటూ ఆ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. గతేడాది రోజా ఆడపిల్లలను చదివించాలనే మంచి ఆలోచనతో ఒక పేద విద్యార్థినిని దత్తత తీసుకున్నారు. పుష్ప కుమారి అనే విద్యార్థిని మెడిసిన్ చదవాలని భావించగా రోజా ఆ విద్యార్థిని మెడిసిన్ చదువుకు
అయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్తు చదువులకు అవసరమయ్యే ఖర్చును కూడా తాను భరిస్తానని మాట ఇచ్చారు. గతేడాది గర్ల్ హోమ్ నిర్వాహకులను చెప్పి రోజా పుష్ప కుమారిని దత్తత తీసుకున్నారు. అయితే పుష్ప కుమారి కూడా రోజా నమ్మకాన్ని నిజం చేయాలని భావించి ఎంతో కష్టపడి చదువుకున్నారు. నీట్ లో పుష్ప కుమారికి ఏకంగా 89 శాతం మార్కులు రాగా రోజా సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు. మరికొన్ని రోజుల్లో రోజా పుట్టినరోజు కాగా పుష్ప మంచి మార్కులు సాధించి పుట్టినరోజు కానుకను ఇచ్చిందని రోజా చెప్పుకొచ్చారు.
పుష్పతో కలిసి దిగిన ఫోటోలను రోజా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం. రోజా మంచి మనస్సును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పేద విద్యార్థులకు సహాయం చేసే గొప్ప గుణం కొంతమందికి మాత్రమే ఉంటుందని నెటిజన్లు రోజాను తెగ మెచ్చుకుంటున్నారు. రోజా నమ్మకాన్ని నిలబెట్టిన పుష్పకుమారిని నెటిజన్లు అభినందిస్తున్నారు.
జగనన్న జన్మదినం సందర్భంగా పోయిన ఏడాది నేను దత్తత తీసుకుని చదివిస్తున్న చిన్నారి పుష్ప నీట్ లో 89% మార్కులు సాధించి, నా పుట్టిన రోజుకు కానుకగా ఇచ్చింది… నాకు చాలా సంతోషంగా ఉంది.
All the best in your future endeavours my dear 😘🤗#HappyDiwali#RojaSelvamanihttps://t.co/yH9aZLsym1pic.twitter.com/AcYV1LhWPx