మలయాళ సినిమా ఛాన్స్‌ కొట్టేసిన శర్వానంద్‌ హీరోయిన్‌!

‘ఏజెంట్‌’ (Agent) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందం సాక్షి వైద్య (Sakshi Vaidya). ఆ సినిమా ఫలితం తేడా కొట్టినా ఈమెకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కారణం క్యూట్‌ ఫేస్‌, ఫ్రెష్‌ లుక్స్‌ అని చెప్పొచ్చు. ఆ సినిమా సెట్స్‌ మీద ఉండగానే కొత్త సినిమాలు ఓకే చేసింది. అలా చేసిన ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) సినిమా కూడా తేడా కొట్టేసింది. అయినా మరో తెలుగు సినిమా ఛాన్స్‌ దక్కించుకుంది. ఇప్పుడు మలయాళం సినిమా కూడా ఓకే చేసింది.

సాక్షి శర్వానంద్‌కు (Sharwanand) జోడీగా రామ్‌ అబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా… ఆమె ‘హాల్‌’ అనే మలయాళం సినిమాతో అక్కడ అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్‌ మీడియాలో టైటిల్‌ పోస్టర్‌ షేర్‌ చేసింది. షేన్‌ నిగమ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్‌ విజయ్‌ కుమార్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అని అంటున్నారు.

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రూపొందిన ‘లక్కీ భాస్కర్‌’లో ఆమెనే హీరోయిన్‌. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. ఇక మాస్‌ మహారాజా సినిమాకు కూడా ఆమె సైన్‌ చేసింది అని వార్తలొచ్చాయి. అనుదీప్‌ దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) చేసే సినిమాలో ఆమెనే నాయిక అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక టైటిల్‌లో చెప్పినట్లు ఇన్‌స్టా మేడమ్‌ ఎందుకు అంటే…

కరోనా – లాక్‌డౌన్‌ టైమ్‌లో చాలామందిలాగే సాక్షి కూడా రీల్స్‌, షార్ట్స్‌ చేసింది. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అలా వాటిని చూసే ‘ఏజెంట్‌’ సినిమా టీమ్‌ ఆడిషన్స్‌కి పిలిచిందట. అలా తొలి సినిమా ఛాన్స్‌ అందుకుంది సాక్షి వైద్య. ఇప్పుడు ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు సంపాదిస్తోంది. అందుకే రీల్స్‌ మేడమ్‌ అంటున్నాం. ఆమె దూకుడు చూస్తుంటే ఇంకొన్ని సినిమాలు వరుస కట్టేలా ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus