సలోని (Saloni).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. సుమంత్ (Sumanth) హీరోగా సూర్య కిరణ్ (Surya Kiran) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధన 51’ (Dhana 51) చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత ‘ఒక ఊరిలో’ ‘చుక్కల్లో చంద్రుడు’ (Chukkallo Chandrudu) ‘మగధీర’ (Magadheera) మర్యాద రామన్న’ (Maryada Ramanna) ‘బాడీ గార్డ్’ (Bodyguard) ‘అధినాయకుడు’ (Adhinayakudu) ‘రేసు గుర్రం’ (Race Gurram) ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ (Meelo Evaru Koteeswarudu) వంటి చిత్రాల్లో నటించింది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియా వంటి ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈమె ఎక్కువగా కనిపించింది ఏమీ లేదు.
అయితే దాదాపు 8 ఏళ్ళ తర్వాత సలోని రీ ఎంట్రీ ఇచ్చింది. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. సరిగ్గా ఈ విషయంపైనే ఇప్పుడు సలోని గురించి చర్చ మొదలైంది. విషయం ఏంటంటే.. ఇటీవల ‘తంత్ర’ (Tantra) అనే సినిమా వచ్చింది. అనన్య నాగళ్ళ (Ananya Nagalla) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో శ్రీహరి (Srihari) తమ్ముడు కొడుకు అయిన ధనుష్ రఘుముద్రి (Dhanush Raghumudri) హీరోగా నటించాడు.

ఈ విషయం కూడా ఎక్కువ మందికి తెలీదు అంటే.. ఎంత వీక్ గా ఈ సినిమా ప్రమోషన్స్ జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో సలోని హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది. అంతేకాదు ఆమె పాత్ర కూడా ఆకట్టుకునే విధంగా ఉండదు. చాలా ఇబ్బందికరంగా ఉంది అనే కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాలో ఆమెకు తన పాత్ర కూడా నచ్చినట్టు లేదు.. అందుకే ప్రమోషన్స్ లో కూడా ఆమె కనిపించడం లేదు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఎలా అంటూ సోషల్ మీడియాలో సలోని పై సెటైర్లు వినిపిస్తున్నాయి.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్
