Game Changer: దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ కోసం మరో రిస్క్ తప్పట్లేదు!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తన సినిమా బ్రాండ్‌ వాల్యూలో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఆయన నిర్మించిన సినిమాలు బలమైన కథలతోనే ముందుకు వెళ్లాలని ఎప్పటినుంచో నమ్ముతారు. అయితే, గత కొంత కాలంగా ఆయన బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతి సీజన్‌కి రెండు భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. రామ్ చరణ్  (Ram Charan) నటించిన గేమ్ చేంజర్, వెంకటేష్‌ (Venkatesh) ప్రధాన పాత్రలో సంక్రాంతికి వస్తున్నాం  (Sankranthiki Vasthunnam)  సినిమాలు గ్రాండ్ గా రానున్నాయి.

Game Changer

శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్  (Game Changer)  పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రమోట్ చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. దిల్ రాజు కోసం ఇది కొత్త రూట్‌ అని చెప్పొచ్చు. పలు సందర్భాల్లో తక్కువ ఖర్చుతోనే ప్రమోషన్స్ పూర్తి చేసే ఆయన ఈసారి మేజర్ మార్పును చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విపరీతమైన క్రేజ్ పొందాలంటే, ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో ఓ ప్రత్యేకమైన క్యాంపెయిన్ అవసరం.

అందుకే దిల్ రాజు, టీం గేమ్ చేంజర్ ప్రమోషన్స్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లనున్నారు. డల్లాస్‌లో మెగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. దీనికి రామ్ చరణ్ సహా మొత్తం మూవీ టీం హాజరుకానున్నారు. ఇలా విదేశాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించడం దిల్ రాజుకి తొలిసారి. ఈ ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకంగా భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ప్రమోషన్ ఖర్చులు 15 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. దీంతో పాటు, దేశీయంగా ఐదు ప్రధాన నగరాల్లో సరికొత్త ప్రమోషన్ కార్య‌క్రమాలను ప్లాన్ చేస్తున్నారు.

జనవరి మొదటి వారంలో స్టార్ట్ కానున్న ఈ క్యాంపెయిన్‌లో రామ్ చరణ్ వివిధ నగరాల్లో అభిమానులతో భేటీ అవుతారు. ఈ కార్య‌క్రమాల ద్వారా సినిమా పబ్లిసిటీ నేషనల్ రేంజ్‌లో ఉండేలా చూడాలని నిర్మాత ఆలోచన చేస్తున్నారు. దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సక్సెస్ క్యాంపెయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈవెంట్స్, ప్రమోషన్ ప్లాన్స్ సినిమాకి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. దిల్ రాజు కూడా అదే ఫార్ములాను ఈసారి గేమ్ చేంజర్ కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది.

 ‘పుష్ప’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus