Sangeetha: ఈసారి అంతకుమించి కామెడీ చేయిస్తారట

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, రష్మిక తర్వాత అంతగా గుర్తుండిపోయే పాత్ర సంగీత. కనిపించేది కొన్ని సీన్స్‌లో అయినా… తనదైన మేనరిజమ్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నారు సంగీత. ‘అబ్బబ్బా నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌’ అంటూ మూతి తిప్పుతూ, నడుం తిప్పుతూ పాత్రను పండించారు సంగీత. ఇప్పుడు అంతకుమించి ఆమెతో కామెడీ చేయించడానికి అనిల్‌ రావిపూడి సిద్ధమవుతున్నరట. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కాంబినేషన్‌లో అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 3’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కరోనా పరిస్థితుల వల్ల సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. అయితే ఈ క్రమంలో కథలో మార్పులు చేశారో, లేక పాత్రలు యాడ్‌ చేశారో కానీ… సినిమాలోకి సంగీత పాత్ర ఎంట్రీ ఇస్తోందట. ‘నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌’ అనుకునే స్థాయిలో ఈ సినిమాలోనూ సంగీత పాత్రను డిజైన్‌ చేశారట. అనిల్‌ రావిపూడి. త్వరలో ఆమె మీద సీన్స్‌ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా వస్తున్న ‘ఎఫ్‌ 3’లో ఇప్పటికే ముగ్గురు కథానాయికలు ఉన్నారు.

తమన్నా, మెహ్రీన్‌ ‘ఎఫ్ 2’ నుండి ఇక్కడకు కొనసాగారు. మరో కీలక పాత్రలో అంజలిని తీసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో చిత్ర బృందం నుండి అధికారిక సమాచారం రాలేదు. ఇప్పుడు సంగీత విషయమూ అంతే. దీంతో పాటు సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉందని సమాచారం. మరి దాని కోసం ఏ హీరోయిన్‌ను తీసుకొస్తారో చూడాలి.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus