Sanjana: బాబు పుట్టిన 11నెలలకే ఆ పని చెయ్యడానికి ఒప్పుకున్న నటి సంజన!

సంజన గల్రాని దక్షిణ భారతదేశం సినిమా భాషలు అన్నిటిలోనూ నటించింది. పెళ్లి చేసుకున్నాక సినిమాలు ఆపేసింది. అయితే బాబు పుట్టాక, ఆ బాబుకు 11 నెలలు వచ్చాక మళ్ళీ కెమెరా ముందుకు రావాలని డిసైడ్ అయింది సంజన. అందుకని బాబు పుట్టిన దగ్గర నుండీ వ్యాయామం, యోగా చేస్తూ మళ్ళీ సినిమాలకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. కన్నడ నటి అయిన సంజన తెలుగు, తమిళం, మలయాళం చాలా సినిమాల్లో కనిపించింది. ఈ సమయం లో మలయాళం నుండి ఒక సినిమా ఆఫర్ రావటం తో ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది.

తెలుగు సినిమా ‘బుజ్జిగాడు’ లో ప్రభాస్ పక్కన త్రిష తో పాటు ఇంకో కథానాయకురాలుగా వేసింది సంజన. పూరి జగన్నాథ్ దీనికి దర్శకుడు. ఈ సినిమాతో సంజన బాగా పేరు పొందింది. అయితే మరి బాబు సంగతి ఏంటి, బాబుని ఎవరు చూస్తారు అనే ప్రశ్న వచ్చింది సంజన కి వెంటనే. సంజన భర్త డాక్టర్ అజీజ్ పాషా బెంగుళూరు లో వాస్కులర్ సర్జన్. “నా భర్త తన పనితో చాల బిజీ గా వున్నా కూడా, బాబుని చూసుకుంటా అని చెప్పాడు.

ఎందుకంటే అతనికి నాకు ఇష్టమైన నా సినిమా కెరీర్ ని నన్ను వదలదు అని చెప్పాడు, అందుకని తానే నన్ను ఎంకరేజ్ చేసాడు. బాబుని చూసుకుంటా అని చెప్పి నన్ను షూటింగ్ కి పంపాడు,” అని చెప్పింది సంజన. ఇప్పుడు సంజన ఒక మలయాళం సినిమా ఒప్పుకుంది. షూటింగ్ కూడా మొదలెట్టేసారు. ఇందులో కథానాయకుడిగా శ్రీనాథ్ బసి చేస్తున్నాడు. సంజన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోంది. అయితే ఆమె ఈ మలయాళం సినిమాలో తెలుగు డైలాగ్స్ చెప్తాను అని అంటోంది.

“తెలంగాణ ప్రాంతం నుంచి కేరళ వచ్చిన పోలీస్ ఆఫీసర్, అందుకనే ఆ పాత్ర నాకు వచ్చింది. ఆమెకి తెలుగులో కూడా డైలాగ్స్ వున్నాయి,” అని చెప్తోంది సంజన. ఈ సినిమా దర్శకుడు విజయ్ కుమార్, మలయాళంలో నటుడుగా కూడా పరిచయం వున్నవాడు. ఇందులో ఇంకా చాలామంది మలయాళం కామెడీ నటులు వున్నారని సంజన చెపుతోంది. ఇది ఒక కామెడీ సినిమా గా ఉంటుంది అని, తన పాత్ర కూడా కామెడీ పాత్ర అని చెప్తోంది సంజన. కేరళలో అప్పుడే వారానికి పైగా షూటింగ్ చేసానని ఇంకా చాలా రోజులు షూటింగ్ వుంది అని చెపుతోంది.

తనతో పాటు తన 11 నెలల బాబు అలరిక్ పాషాని కూడా తీసుకు వెళ్ళాను అని చెప్తోంది. (Sanjana) సంజన మదర్ కూడా బాబుతో పాటు ట్రావెల్ అయ్యారు, బాబుని చూసుకోవడానికి. సంజన ఎప్పుడూ అనుకోలేదట తాను ఇంత తొందరగా మళ్ళీ షూటింగ్ చేస్తాను అని. ఎందుకంటే బాబు పుట్టాక ఎలా చెయ్యాలి, ఏ సినిమా చెయ్యాలని అని ఆలోచిస్తున్న సమయం లో ఈ మలయాళం సినిమా రావటం, తన పాత్ర నచ్చటం, వెంటనే ఒప్పుకోవటం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి అని చెప్తోంది. ఇలా మళ్ళీ కెమెరా ముందుకు రావటం చాల సంతోషంగా ఉందని అంటోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus