Koratala Siva, Shankar: కోరటాలను కాదని.. శంకర్ కు గ్రీన్ సిగ్నల్

సాధారణంగా హిట్ ఇచ్చిన దర్శకులకు ఏ హీరోయిన్స్ కూడా అంత ఈజీగా నో చెప్పారు. మరో ఛాన్స్ వస్తే ఆడిగినన్ని డేట్స్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ ఒక బాలీవుడ్ బ్యూటీ మాత్రం హిట్ ఇచ్చిన దర్శకుడికి డైరెక్ట్ గా హ్యాండ్ ఇచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కీయరా అద్వానీ ఆ తరువాత టాలీవుడ్ ఆఫర్స్ పై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టింది.

నిజానికి భరత్ అనే నేను సినిమాలో ఆమె పాత్ర పెద్దగా క్లిక్కవ్వలేదు. అయినప్పటికీ సినిమా హిట్టయ్యింది కాబట్టి ఆఫర్స్ గట్టిగానే వచ్చాయి. కానీ అమ్మడు తొందర పడకుండా కేవలం తనకి నచ్చిన కథలని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఇక అందులో రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే కథపై పెద్దగా ఫోకస్ పెట్టకుండానే వినయ విధేయ రామ సినిమా చేయడానికి ఒప్పేసుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో దెబ్బకొట్టిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కీయరాను ఇటీవల ఎన్టీఆర్ 30 కోసమని కొరటాల సంల్రాదించగా డేట్స్ లేవని చెప్పేసిందట. అనంతరం శంకర్ కథ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ 15వ సినిమా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా కంటే ఈ సినిమానే బెటర్ అని అమ్మడు సడన్ గా నిర్ణయం మార్చుకున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మరి కీయరా నిర్ణయం ఆమె కెరీర్ కు ఏ విదంగా హెల్ప్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus