Actress: తన పెళ్లి, ప్రెగ్నెన్సీ గురించి నటి ఏం చెప్పిందంటే..?

సోషల్ మీడియా కారణంగా మంచి ఎంత ఉందో తెలియదు కానీ బ్యాడ్ మాత్రం బీభత్సంగా స్ప్రెడ్ అయిపోతుంది.. ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న వార్తల గురించి అయితే చెప్పక్కర్లేదు.. లవ్, రిలేషన్, బ్రేకప్, పెళ్లి, ప్రెగ్నెన్సీ.. ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు వాటి గురించి క్లారిటీ ఇవ్వడానికి కిందా మీద పడుతుంటారు.. అవన్నీ పుకార్లేనని చెప్పేసరికి తల ప్రాణం తోకకస్తుందంటే నమ్మండి.. ఇటీవల జ్వాలా గుత్తా – విష్ణు విశాల్ విడిపోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి..

విష్ణు క్లారిటీ ఇవ్వడంతో ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది.. ఇప్పుడు ఓ పాపులర్ నటి, నటుడికి పెళ్లి చేేసేశారు నెటిజన్లు.. అంతేనా, ఆమె గర్భవతి అని కూడా ప్రచారం చేస్తున్నారు.. ఇప్పుడు తమ గురించి పుట్టుకొస్తున్న పుకార్ల గురించి సదరు నటి స్పందిస్తూ.. సెటైర్స్ వేసింది.. వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ నటి పావని రెడ్డి తమిళంలో పలు సీరియల్స్ చేసింది.. బిగ్ బాస్ – 5 లో పార్టిసిపెట్ చేసి గుర్తింపు తెెచ్చుకుంది..

రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు కొరియోగ్రాఫర్ ఆమిర్, పావనిని (Actress) చూడగానే ప్రేమలో పడ్డాడు.. ఆమెకు ప్రపోజ్ చేశాడు కానీ లైట్ తీసుకుంది.. కాగా, బిగ్ బాస్ డ్యాన్స్ జోడీ షోలో పాల్గొన్న సమయంలో ప్యార్‌లో పడ్డారు.. షోలో విన్నర్స్‌గా నిలిచిన వీరు రియల్ లైైఫ్‌లోనూ జోడీకాబోతున్నామని చెప్పారు.. ‘తునివు’ (తెగింపు) మూవీలోనూ లవర్స్‌గా నటించారు.. కొద్దికాలంగా చెన్నైలో వీరు సహజీవనం చేస్తున్నారని టాక్..

ఈ నేపథ్యంలో ఫ్యాన్స్, నెటిజన్స్ ‘పెళ్లెప్పుడు’ అంటూ విసిగించేస్తున్నారు.. తాజాగా ఓ ఫ్యాన్.. ‘మీ ఇద్దరికీ పెళ్లైపోయింది.. కానీ, ఎందుకు దాచిపెడుతున్నారు.. బయటకి చెప్పొచ్చుగా’ అని అడిగింది.. దీనికి పావని రియాక్ట్ అవుతూ.. ‘పోయిన నెలలో నేను గర్భవతిని అన్నారు.. తర్వాత బ్రేకప్ చెప్పుకున్నామన్నారు.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నామంటున్నారు.. మరి తర్వాత ఏంటి?’ అంటూ కౌంటర్ వేసింది.. దీంతో పావని రెడ్డి – ఆమిర్‌ల మ్యారేజ్ టాపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus