Actress Shakeela: ఆ దర్శకునిపై షకీలా షాకింగ్ కామెంట్స్!

సౌత్ ఇండియాలోని ప్రముఖ నటీమణులలో షకీలా ఒకరనే సంగతి తెలిసిందే. మలయాళ శృంగార సినిమాలలో ఎక్కువగా నటించడం ద్వారా షకీలా గుర్తింపును సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియాలోని అన్ని భాషలతో పాటు హిందీ భాషలలో కూడా షకీలా నటించారు. షకీలా నటించిన కొన్ని సినిమాలు విదేశాల్లోకి కూడా డబ్ అయ్యాయి. 2003 సంవత్సరం తర్వాత శృంగార చిత్రాలకు దూరంగా ఉంటూ చాలా సినిమాల్లో షకీలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి నటిగా బిజీగా ఉన్న షకీలా తన సినీ కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. షకీలా జీవిత చరిత్ర ఆధారంగా “షకీలా” పేరుతో ఒక సినిమా తెరకెక్కి గతేడాది డిసెంబర్ లో విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు ఏర్పడినా రిలీజైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాకు ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించారు.

తాజాగా ఒక చిట్ చాట్ షోలో మాట్లాడిన షకీలా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తన దగ్గరకు వచ్చిన సినిమా దర్శకులు కానీ బంధువులు కానీ నమ్మదగిన వ్యక్తులు కాదని షకీలా అన్నారు. తన రిలేటివ్స్ ఆర్థిక సాయం పొందిన తర్వాత మోసం చేశారని షకీలా వెల్లడించారు. “షకీలా” సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయకముందు దర్శకుడు ఇంద్రజిత్ తనతో చాలా విషయాలను చర్చించాడని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే ఆ తర్వాత సినిమా కథను ఇష్టానుసారం మార్చేశాడని ఆమె కామెంట్లు చేశారు. “షకీలా” సినిమాపై తాను చాలా ఆశలు పెట్టుకున్నానని బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిందని షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దవ్వు మాస్టర్ అనే కన్నడ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం పాల్గొంటున్నానని షకీలా అన్నారు. ప్రస్తుతం షకీలా పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. వందల సంఖ్యలో సినిమాలలో నటించినా షకీలా ఆర్థికంగా స్థిరపడలేదు. తెలుగులో ఈ మధ్య కాలంలో షకీలాకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus