‘మహర్షి’ అనగానే మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అనుకోకండి..! గతంలో కూడా ఓ ‘మహర్షి’ వచ్చింది. వంశీ గారి దర్శకత్వంలో నటుడు రాఘవ హీరోగా 1987 లో ‘మహర్షి’ అనే మూవీ వచ్చింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్.. తన ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. అందుకే అతను నటించిన ‘నేను శైలజ’ సినిమాలో కూడా ‘మహర్షి’ సినిమా రిఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఇక ‘మహర్షి’ అప్పట్లో ఓ సూపర్ హిట్ మూవీ.
అప్పటి యూత్ కు బాగా కనెక్ట్ అయిన మూవీ ఇది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్లే. ‘మాటరాని మౌనమిది’ , ‘సుమం ప్రతి సుమం సుమం’ వంటి పాటలు ఇప్పటి ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది శాంతి ప్రియా. ఈమె మరెవరో కాదు ప్రముఖ స్టార్ హీరోయిన్ భానుప్రియకి స్వయానా చెల్లెలు. తర్వాత ‘సింహ స్వప్నం’ ‘యమపాశం’ ‘రక్త కన్నీరు’ ‘నాకు పెళ్ళాం కావాలి’ వంటి సినిమాల్లో ఈమె నటించింది.
ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించింది. ఈమె పుట్టిపెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకి చెందిన రాజమండ్రిలో..! ఈమె సిద్దార్థ్ రాయ్ అనే నటుడిని 1999లో పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తు 2004 లో ఆయన గుండెపోటుతో మరణించాడు. వీళ్ళకి ఇద్దరు కొడుకులు. ఇదిలా ఉండగా.. శాంతి ప్రియ లేటెస్ట్ ఫోటోలు ఇటీవల హల్ చల్ చేసాయి. ఈ ఫొటోల్లో ఆమె గుర్తుపట్టలేని విధంగా ఉంది.