Shobana: పొగమంచులో హెలికాప్టర్ కోసం శోభన ఎదురు చూపులు.. వీడియో వైరల్..!

సీనియర్ నటి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శోభన.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా కానీ నాట్య ప్రదర్శనలతో, క్లాసికల్ డ్యాన్స్‌లకు సంబంధించిన క్లాసులు చెప్తూ బిజీగా ఉంటున్నారు. వీలు చూసుకుని పుణ్యక్షేత్రాలు సందర్శంచడం ఆమెకు చాలా ఇష్టం.. 52 ఏళ్ల శోభన తన ప్రొఫెషన్ గురించిన అప్‌డేట్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులు, నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. శోభన రీసెంట్‌గా ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన కేదార్‌నాథ్ వెళ్లారు.

అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలిసిందే. దట్టమైన పొగమంచు కప్పెయ్యడంతో జలుబు చేసిందంటూ.. కేదార్‌నాథ్‌ ఆలయం దగ్గర పరిస్థితిని వీడియో ద్వారా తెలియజేశారు. వెదర్ గురించి వివరిస్తూ.. హెలికాప్టర్ కోసం ఎదురు చూస్తున్నానని, మంచు పోయాక బయలు దేరతామని, వివరాలన్నీ అప్‌డేట్ చేస్తానని అన్నారు. ఇదంతా చెప్తుంటే నేను న్యూస్ రిపోర్టర్‌లా ఉన్నానంటూ నవ్వేశారామె. శోభన షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.. క్షేమంగా ఇంటికి చేరుకోండి.. హ్యాపీ జర్నీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

శోభన తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్స్ అందరితోనూ నటించారు. మాతృభాష మలయాళంతో పాటు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్‌లోనూ సినిమాలు చేశారు. దాదాపు 200 చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. రెండు సార్లు నేషనల్ అవార్డ్స్, రెండు సార్లు ఫిలింఫేర్, తమిళనాడు స్టేట్ కలైమామణి అవార్డ్ అందుకున్నారు. సినిమా, భరతనాట్యంలో చేసిన కృషికిగానూ 2006లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన.. ప్రముఖ గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత.. చిత్రా విశ్వేశ్వరం శిష్యురాలు కావడం విశేషం.. ఆ తర్వాత డాక్టర్ పద్మా సుబ్రమణ్యం వద్ద శిష్యురాలుగా చేరారామె.. దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలివ్వడంతో పాటు అంతర్జాతీయంగానూ ప్రశంసలు పొందారు.. భరతనాట్యానికి భారత రాయబారిగా.. కళారూపాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.. జీవితంలో జరిగిన అనుకోని సంఘటన కారణంగా పెళ్లికి దూరంగా ఉన్నారు శోభన..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus