Shobha Shetty: అవకాశాలు లేక నటి శోభా శెట్టి చేయాల్సి వస్తుందట.!

‘కార్తీక దీపం’ సీరియల్ గురించి తెలియని వారంటూ ఉండరు అంటే అతిశయోక్తి అనిపించుకోదేమో. టెలివిజన్ రంగంలో అత్యధిక టి ఆర్ పి రేటింగ్ సాధించి చరిత్ర సృష్టించింది ఈ సీరియల్. ఇందులో నటించిన వారంతా చాలా ఫేమస్ అయిపోయారు. 2017 లో స్టార్ట్ అయిన ఈ సీరియల్ 5 ఏళ్ళ పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలపై సోషల్ మీడియాలో ఎన్ని మీమ్స్ వచ్చేవో అందరూ చూశారు కదా.

అయితే ఈ సీరియల్ ఇంత సక్సెస్ అవ్వడానికి అలాగే సీరియల్ పై ప్రేక్షకులకు అంత ఇంట్రెస్ట్ కలగడానికి మరో ముఖ్య కారణం లేడీ విలన్ మోనిత పాత్ర అని చెప్పాలి. ఈ పాత్రను పోషించింది కన్నడ నటి శోభా శెట్టి. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క లను విడదీయడానికి ఈమె వేసే స్కెచ్ లు సీరియల్ ను ప్రేక్షకులు డైలీ చూసేలా చేశాయని చెప్పాలి. అయితే ఈ సీరియల్ వల్ల శోభా శెట్టికి మరిన్ని సీరియల్స్ లో లేదా టీవీ షోలలో అవకాశాలు లభిస్తాయని అంతా అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. ఈమెకు సీరియల్ లో కూడా అవకాశం లభించలేదు.ఓ చిన్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ లభించింది అన్నారు. కానీ ఈమె దురదృష్టం ఏంటో కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందట. వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది అనుకున్న ఈ నటి పరిస్థితి ఇలా అయిపోయింది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈమెకు గుప్పెడంత మనసు సీరియల్ లో అవకాశం లభించిందట.

అయితే అది హీరో పాత్ర చేస్తున్న ఋషికి పెద్దమ్మ పాత్రట. అవకాశాలు లేకపోవడంతో ఆ పాత్ర చేయడానికి కూడా శోభా శెట్టి రెడీ అయిపోయినట్టు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus