యంగ్‌ లుక్‌ కోసం ఆ గ్లామర్‌ భామ అలా అనేసిందేంటి?

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి, బతికినన్ని రోజుల్లో వీలైనన్ని రోజులు యంగ్‌గా, అందంగా కనిపించాలని కోరుకుంటారు. అవకాశం ఉన్నంతవరకు సహజంగా వాటి కోసం ట్రై చేస్తారు. ఇక వీలుకాని పక్షంలో మేకప్‌తో ట్రై చేస్తారు, ఇంకా కాకపోతే సర్జరీల జోలికి వెళ్తారు. అలా వెళ్లిన సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. అయితే నిత్య యవ్వనం కోసం ట్రై చేసేవాళ్లూ ఉన్నారు. అందులో పాప్‌ స్టార్‌ కిమ్‌ కర్దాషియాన్‌ ఒకరు. ఈ మధ్య దీని గురించి ఆమె చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది.

యవ్వనంగా కనిపించేందుకు నేటి యువత బాగా ట్రై చేస్తోంది. ఈ క్రమంలో సెలబ్రిటీలు తమ అందం రహస్యం, యవ్వన రహస్యం గురించి ఏం చెబుతారా అని చూస్తుంటారు. అందులో కొన్ని ఫాలో అవుతంటారు కూడా. అలాంటివాళ్లు మాత్రం కిమ్‌ కర్దాషియాన్‌ మాటలు అస్సలు వినొద్దు అని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే యవ్వనంగా ఉండటానికి మలం ఉపయోగపడుతుంది అంటే.. తినడానికి సిద్ధం అంటూ ఆమె స్టేట్‌మెంట్‌ ఇచ్చింది కాబట్టి.

కిమ్ కర్దాషియన్ అమెరికాలో చాలా పాపులర్. అక్కడనే కాదు ఎక్కడైనా ఆమె పాపులరే. టీవీ షోలతో ఆకట్టుకుంటూనే, ఫ్యాషన్‌ ఛాయిస్‌లతో మైమరిపిస్తుంది. ఆమె డ్రెస్సింగ్‌, బాడీ ఫిజిక్‌తో కుర్రకారును అలరిస్తోంది. అందుకే 41 ఏళ్లు వచ్చినా ఆమె సూపర్‌ ఫిట్‌గా ఉంటోంది. ఈ క్రమంలో కిమ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘యవ్వనంగా కనిపించేందుకు నేను ఏం చేయడానికైనా సిద్ధమే. రోజూ మలం తింటే యవ్వనంగా కనిపిస్తారని మీరు చెబితే తింటానేమో” అని అంది.

దీంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఓవైపు ఇదేం పాడు రోగం అని కొందరు అనుకుంటుంటే, ఆమె అంతే ఇక మారదు అంటూ ఇంకొందరు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. అయినా యవ్వనం కోసం ఇంత పాకులాట ఎందుకో కిమ్‌ కర్దాషియానే చెప్పాలి. పొరపాటున శాస్త్రవేత్తలు ఎవరైనా కిమ్‌కి యస్‌ చెబితే పరిస్థితి ఏంటో?

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus