Shruti Haasan: శారీరకంగా దృఢంగా లేను.. శృతిహాసన్ పోస్ట్ వైరల్?

కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి విజయాలను సొంతం చేసుకున్న శృతిహాసన్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల పూర్తిగా కెరియర్ ను పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. శృతిహాసన్ ప్రస్తుతం తెలుగు సినిమాలే కాకుండా పాన్ ఇండియా స్థాయి సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు అదే విధంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగులో ఎంతో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్లో కూడా ఈమె పాల్గొనబోతున్నారు. ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నట్టు వంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా శృతిహాసన్ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ తాను ఇబ్బంది పడుతున్న సమస్యల గురించి వెల్లడించారు. జిమ్ లో కఠినతరమైన వర్కౌట్లు చేస్తూ ఉన్న వీడియోని షేర్ చేస్తూ ప్రస్తుతం తను పీసీఓఎస్‌, ఎండోమెట్రియోసిస్‌ వంటి హార్మోన్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ విధంగా తను ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడటం కోసం పోరాటం చేస్తున్నానని సరిగ్గా తినడం నిద్రపోవడం, నా పని చేసుకోవటం వల్ల మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానని ఈమె తెలిపారు.

సాధారణంగా మహిళలలో ఇలాంటి హార్మోన్లు అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే తాను మాత్రం దీనిని ఒక సమస్యగా కాకుండా,మహిళలో జరిగే సహజ ప్రక్రియ గా భావిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నప్పటికీ శారీరకంగా దృఢంగా లేనని ఈమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus