తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేసి ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత. 1980, 90 ల కాలం ప్రేక్షకుల్లో ఈమె తెలియనివారంటూ ఉండరు అనడంలో సందేహం లేదు. ఈమె సినిమాల్లో ఒక్క పాట చేస్తుంది అంటేనే ఆ సినిమా పై బోలెడంత క్రేజ్ ఏర్పడేదట. కేవలం సిల్క్ స్మిత క్రేజ్ తోనే గట్టెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. అంత స్టార్ డమ్ సంపాదించుకుంది సిల్క్ స్మిత.
అయితే 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఈమె వయసు కేవలం 35ఏళ్ళు మాత్రమే. అసలు ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయం పై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ‘ఎ డర్టీ పిక్చర్’ వంటి చిత్రాన్ని ఈమె బయోపిక్ గా తీసి క్యాష్ చేసుకున్నారు కానీ.. అందులో కూడా ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణం ఏంటన్నది మాత్రం చూపించలేదు. ఈమె ఆత్మహత్య వెనుక పెద్ద వాళ్ళ హస్తం ఉంది అనే అనుమానాలు కూడా ఇప్పటికీ వ్యక్తం చేసేవారున్నారు. ‘సినిమాల్లో కైపెక్కించి జనాలను మోసం చేసే పాత్రలు చేసిందేమో కానీ..
నిజ జీవితంలో సిల్క్ స్మితకు అంత తెలివి లేదు… ఎవ్వరినైనా సులభంగా నమ్మేసి మోసపోయే వ్యక్తి’.. అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.మరికొందరైతే.. ‘అమాయకత్వం ఉన్నంత వరకూ మోసం చేసేవాళ్ళ రాజ్యమే నడుస్తుంది’ అని అగ్రెసివ్ గా సిల్క్ స్మిత గురించి సంభోదిస్తున్నారు. ఎవరెన్ని ఎమోషన్స్ వ్యక్తం చేసినా.. ‘సిల్క్ స్మిత ఆత్మహత్య విషయం మాత్రం ఎప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోతుంది’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు. మరి అసలు మ్యాటర్ ఎప్పటికి బయటపడుతుందో..!