Sreeleela: కథ విన్న పది నిమిషాలకే ఓకే చెప్పాను… శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా నిర్మాణంలో రవితేజ శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హాజరైనటువంటి శ్రీ లీల ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ లీల మాట్లాడుతూ ధమాకా సినిమా కథ విన్న తర్వాత కేవలం 10 నిమిషాలకే సినిమాకు ఓకే చెప్పానని ఈమె తెలిపారు.

ధమాకా మంచి ఎంటర్టైనింగ్ మూవీ. ఈ జానర్ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని , అందుకే కథ విన్న పది నిమిషాలకే సినిమాకు ఓకే చెప్పానని ఈమె తెలియజేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదట్లో రవితేజ గారిని చూసి కాస్త భయపడినప్పటికీ ఆయన ఎంతో సరదాగా మాట్లాడటమే కాకుండా, కొన్ని మెలకువలు కూడా తనకు తెలియజేశారని శ్రీ లీల పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో జింతాక్ పాట తనకు ఎంతో ఇష్టమని తెలియజేశారు.

ఈ పాట కోసం చిత్ర బృందం మొత్తం స్పెయిన్ వెళ్ళామని అక్కడ ఈ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో తన కాస్ట్యూమ్ బ్యాగ్ ఎక్కడో పోయిందని శ్రీ లీల తెలిపారు.ఇలా కాస్ట్యూమ్ బ్యాగ్ కనిపించకపోవడంతో చాలా టెన్షన్ పడ్డామని అయితే షూటింగ్ లోకేషన్ నుంచి దాదాపు మూడు గంటల పాటు ప్రయాణం చేసి మా డిఓపి, డైరెక్టర్ నాకోసం షాపింగ్ చేశారని ఈమె తెలిపారు.

అక్కడ వాళ్ళు షాపింగ్ చేస్తూ ఫోటోలన్నీ తనకు పంపించి నేను సెలెక్ట్ చేసినవి తీసుకువచ్చారని శ్రీ లీల అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.ఈ విధంగా నా కోసం డైరెక్టర్ షాపింగ్ చేస్తుంటే నా కుటుంబ సభ్యులే తన కోసం షాపింగ్ చేసిన అనుభూతి కలిగిందని, ధమాకా సినిమా షూటింగ్లో తనకు ఇది ఒక స్వీట్ మెమోరీ అంటూ ఈ సందర్భంగా శ్రీ లీల ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus