నా చావుకి అతని వేధింపులే కారణం.. వైరల్ అవుతున్న నటి సూసైడ్ నోట్!

బుల్లితెర నటి వైశాలి టక్కర్ నిన్న ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. పలు హిందీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె అనుమానాస్పద స్థితిలో సూసైడ్ చేసుకుని చనిపోవడం ను కుదిపేసింది. ఇప్పుడిప్పుడే ఆమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. పైగా ఆమె వయసు కూడా 29 సంవత్సరాలే. కెరీర్ ఇప్పుడిప్పుడే మంచిగా సాగుతున్న టైంలో ఆమె ఇలాంటి అగాయిత్యానికి పాల్పడడం అనేది ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండోర్ లో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని చనిపోతే .. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా అక్కడ వీరికి ఓ సూసైడ్ నోట్ లభించిందట.ఇందులో ‘ రెండున్నరేళ్లుగా పొరుగింటి వ్యక్తి రాహుల్ నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. అమ్మ నాన్న నేను చనిపోయాక అతన్ని మరియు అతని భార్యని శిక్షించడం మర్చిపోకండి . నా చావుకి అతనే కారణం ‘ అంటూ పేర్కొంది. ఇక రాహుల్ .. వైశాలి మాజీ ప్రియుడు అని కొంతమంది అంటున్నారు. ఆమె చనిపోయే రోజు ముందు తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది వైశాలి.

ఇందులో తన బాయ్ ఫ్రెండ్ వల్ల మోసపోయినట్టు ఆమె తెలిపింది. డబుల్ గేమ్ ఆడి ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక 2016 లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వైశాలి సూపర్ సిస్టర్స్, యే రిక్తా క్యా కేల్తా హై, యహ్ వదా రహా, యే హై ఆషికీ బృందా వంటి సీరియల్స్ లో నటించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus