Sunaina: ఆ ఇద్దరు స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ సునైనా.?

తెరమీద హీరోయిజం చూపించే కథానాయకులు కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటారనే సంగతి తెలిసిందే.. ఒకప్పుడు బాలీవుడ్ హీరోస్ రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేవారు.. బాలీవుడ్ తర్వాత అంత పెద్ద మార్కెట్ (ఎక్కువ స్థాయిలో సినిమాలు తెరకెక్కించేది) టాలీవుడ్ అయినా.. తెలుగు హీరోల కంటే కోలీవుడ్ స్టార్స్ ఎక్కువ డిమాండ్ చేసేవారు.. పాన్ ఇండియా స్టార్ బ్రాండ్ వచ్చాక రెబల్ స్టార్ ప్రభాస్ వంద కోట్లు తీసుకుంటున్నాడు.. తమిళనాట సూపర్ స్టార్ రజినీ కాంత్, దళపతి విజయ్ వంటి హీరోలు వంద కోట్ల మార్క్ క్రాస్ చేసేశారు..

తల అజిత్ కుమార్ కూడా దగ్గర దగ్గర 100 CR అందుకుంటున్నాడని టాక్.. తలైవా, దళపతి అయితే 120 నుంచి 130 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.. గతంలో చాలా సార్లు హీరోల పారితోషికాల గురించి కొందరు కథానాయికలు బహిరంగంగానే కామెంట్స్ చేశారు.. హీరోలకు కోట్లకు కోట్లు.. మాకు మాత్రం కేవలం లక్షల్లో ఇస్తున్నారు.. ఈ తీరు మారాలి.. మాకు కూడా హీరోలకు సమానంగా జీతాలు ఇవ్వాలి అని మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు..

ఇప్పుడు సునైనా కూడా హీరోలు అన్నేసి కోట్లు తీసుకుని ఏం చేస్తారోనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.. అచ్చ తెలుగమ్మాయి సునైనా తమిళనాట పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇటీవల ఓ కోలీవుడ్ ఛానల్‌కిచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందామె.. స్క్రిప్ట్ రాసి, నటించే ఛాన్స్ వస్తే.. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, విజయ్ వంటి హీరోలను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది..

అలాగే హీరోలు వంద కోట్లు తీసుకుంటున్న విషయం గురించి తనకు కొందరు చెప్పారని.. అయినా అంత డబ్బు తీసుకుని ఏం చేస్తారబ్బా? అనే సందేహం కలుగుతుందని.. తన ఫస్ట్ ఫిలింకి కేవలం రూ. 15 వేలు తీసుకున్నానని.. తన వరకు వస్తే.. ఆడియన్స్ తన నటనను ఎలా ఆనందిస్తున్నారు అనేదే ముఖ్యమని చెప్పుకొచ్చింది సునైనా..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus