Actress Tabu: మొదటిసారి తండ్రిని తెలుసుకొని ఎమోషనల్ అయిన నటి టబు!

చిత్ర పరిశ్రమలో తెలుగు తమిళ హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్రస్తుతం ఐదు పదుల వయసులో ఉన్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇకపోతే కెరియర్ ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఎంతోమంది నటీమణులు పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. టబు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నారని చెప్పాలి.

ఈమె ఐదు పదుల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతున్నారు. ఇకపోతే ఈమె నటిగా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా తన తల్లిదండ్రుల గురించి ప్రస్తావన తీసుకురాలేదు.వీరిద్దరూ చిన్నప్పుడే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోయారని అందరికీ తెలిసిందే. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి టబు తన తండ్రి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన సోదరి కొన్ని పనుల నిమిత్తం అప్పుడప్పుడు

తన తండ్రిని కలిసేదని అయితే తాను తన తండ్రిని ఎప్పుడు కలవలేదని ఈమె తెలియజేశారు.తనని కలవాలనే ఆలోచన కూడా నాకు లేదని నేను ఎలా పెరిగానో అందులోనే నా సంతోషాన్ని వెతుక్కున్నానని ఈమె వెల్లడించారు. ఇకపోతే చిన్నప్పుడు నేను అతనితో కలిసి పెరిగిన జ్ఞాపకాలు నాకు లేవు. తండ్రి లేకుండానే ఒంటరిగా జీవితంలో పెరిగానంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.

ఇలా టబు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో కూడా అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus