Tamannaah: కుటుంబ సభ్యులను మిస్ అవుతున్న అంటూ బాధపడుతున్న తమన్నా?

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తమన్నా ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా తెలుగు తమిళ్ కన్నడ భాషలతో పాటు హిందీ భాషలో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ … తమన్నా చాలా బిజీగా ఉంది.

ఇటీవల తమన్నా నటించిన లేడీ బౌన్సర్ అనే బాలీవుడ్ సినిమా తో తమన్నాకి ప్లాప్ ఎదురయ్యింది.ఇదిలా ఉండగా ప్రస్తుతం తమన్నా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమన్నాకి దసరా దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టమని.. ఈ పండుగలను తమన్న కచ్చితంగా తన కుటుంబ సభ్యులతో కలసి జరుపుకుంటుంది. కానీ ప్రస్తుతం తమన్న దీపావళి పండుగ రోజున ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు వెల్లడించింది.

ఇలా పండుగకు ఇంటికి దూరంగా ఉండాల్సి రావటంతో తమన్నా బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమన్నా మలయాళం లో ఎంట్రీ ఇవ్వటానికి ‘దిలీప్‌ 147’ చిత్రంతో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ కేరళలో జరుగుతోంది. షూటింగ్‌ ఉండటం వల్ల తమన్నా ఈసారి ఇంటికి వెళ్లడం కుదరలేదు. అందువల్ల మలయాళ చిత్ర బృందంతో దీపావళి పండుగ జరుపుకోనున్నట్లు తమన్నా వెల్లడించింది.

దీపావళి రోజు పని చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ప్రస్తుతం షూటింగ్ వల్ల ఇంటికి వెళ్లలేని పరిస్థితి. మొదటిసారిగా ఇంట్లో కాకుండా ఈ సారి ఇక్కడ సినిమా యూనిట్ తో కలిసి దీపావళి సెలబ్రేట్‌ చేసుకుంటున్నా. ఇదో కొత్త అనుభూతి. దాని కోసం నేను ఎదురుచూస్తున్నాను…అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో “గుర్తుందా శీతాకాలం” అనే సినిమాతో పాటు చిరంజీవి హీరోగా నటిస్తున్న “భోళా శంకర్” సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus