Tripti Dimri: ‘యానిమల్‌’ సినిమా ఆమెకు ఇలా కూడా ఉపయోగపడిందిగా…

కొన్ని సినిమాల్లో చిన్న పాత్ర చేసినా చాలు చాలా ఫేమస్‌ అయిపోతారు. అందులోనూ ఆ సీన్‌ కాస్త హాట్‌గా ఉండే ఇంటిమేట్‌ సీన్‌ అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటిమేట్‌ సీన్‌ అంటే… ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమెనే త్రిప్తి దిమ్ర. అయితే ఈ క్లారిటీ ‘యానిమల్‌’ సినిమా చూసినవాళ్లకు, దాని గురించి తెలిసినవాళ్లకు మాత్రమే. రణ్‌బీర్‌ కపూర్‌ – రష్మిక మందన జోడీగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా ‘యానిమల్‌’.

ఈ సినిమాలో జోయా అనే చిన్న పాత్ర చేసింది త్రిప్తి దిమ్రి. ఈ సినిమాలో ఆమెకు, రణ్‌బీర్‌కు మధ్య ఓ ఇంటిమేట్ సీన్‌ కూడా ఉంది. ఆ సీన్‌, ఈ అమ్మడు ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా ఫేమస్‌. మరోవైపు జోయా పాత్ర వల్ల త్రిప్తికి వరుస ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఆ విషయం పక్కనపెడితే ‘యానిమల్‌’ సినిమా తర్వాత త్రిప్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ చాలా పెరిగారట. నవంబర్‌ చివరి వారంలో త్రిప్తి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ చూస్తే… 6 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉండేవారు.

ఇప్పుడు చూస్తే మూడు మిలియన్లు దాటిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా త్రిప్తి రీల్స్‌కు ఇప్పుడు మామూలు ఆదరణ ఉండటం లేదు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌లకు లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి. ఇక సినిమాల సంగతి చూస్తే టాలీవుడ్‌లో ఓ స్టార్‌ హీరో సినిమా కోసం ఆమెను సంప్రదించారు అని టాక్‌ నడుస్తోంది.‘యానిమల్‌’ తనకు అంత పేరు తీసుకొచ్చిన ఇంటిమేట్‌ సీన్‌ గురించి త్రిప్తి మాట్లాడిన మాటలు కూడా వైలర్‌ అవుతున్నాయి.

సినిమాకు ఆ సీన్‌ ఎంత అవసరమో దర్శకుడు చెప్పారు. అందుకే అలా నటించడానికి అంగీకరించాను. షూటింగ్‌ సమయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే సులభంగా చేసేయగలిగాను అని చెప్పింది (Tripti Dimri) త్రిప్తి. ఇక ఈ సినిమా సంగతి చూస్తే ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus