తెలుగు ప్రేక్షకులకి త్రిషని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘వర్షం’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘అతడు’ వంటి హిట్ సినిమాలతో ఆమె రేంజ్ పెరిగింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సహజంగానే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అయితే తమిళంలో మాత్రం త్రిష టాప్ ప్లేస్ లోనే కొనసాగుతుంది. 39 ఏళ్ల వయసులో కూడా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి.
’96 ‘ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా బయ్యర్స్ కి కోట్లల్లో లాభాలను అందించింది. నటిగా కూడా ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పీ ఎస్ 1 ‘, ‘పీ ఎస్ 2 ‘ చిత్రాలు కూడా తమిళంలో రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా ‘పీఎస్ 1 ‘ అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘పొన్నియన్ సెల్వన్’ లో ఐశ్వర్య రాయ్ ఉన్నప్పటికీ కూడా త్రిషనే ఎక్కువ మార్కులు కొట్టేసింది.
ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘లియో’ లో కూడా త్రిష… విజయ్ కి జోడీగా నటించింది. అలాగే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కలెక్ట్ చేస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా యూ.ఎస్ లో ‘లియో’ సినిమా 5 మిలియన్ల కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.దీనికి ముందు వచ్చిన ‘పీ ఎస్ 1 ‘ 6 మిలియన్ డాలర్లు, ‘పీ ఎస్ 2 ‘ 5 మిలియన్ డాలర్లు వసూల్ చేసి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేశాయి.
ఇలా ఓ హీరోయిన్ కెరీర్లో బ్యాక్ టు బ్యాట్ 5 మిలియన్ మూవీస్ పడటం ఇదే మొదటిసారి. 39 ఏళ్లలో ఇలాంటి రేర్ రికార్డుని కైవసం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదనే చెప్పాలి. అందుకే తెలుగులో కూడా మళ్ళీ త్రిషకి ఛాన్స్ లు ఇవ్వాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.