సినిమాల నిర్మాణంలో చిన్న, పెద్ద అనే తేడా లేదని, ఎందులో అయినా కళాకారుల శ్రమ ఒక్కటేనని సీనియర్ నటి ఊర్వశి అన్నారు. అయితే, తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రాలకు పబ్లిసిటీ ఎక్కువగా అవసరం అవుతుందని, ఈ విషయంలో మీడియా సపోర్టు చేయాలని ఆమె కోరారు. సినిమా ఇంటర్వ్యూలో మీకు నచ్చిన నిర్మాత ఎవరు అని కూడా అడగాల్సిందిగా ఆమె మీడియాను రిక్వెస్ట్ చేశారు. సినిమాల నిర్మాణంలో చిన్న, పెద్ద అనే తేడా లేదని, ఎందులో అయినా కళాకారుల శ్రమ ఒక్కటేనని సీనియర్ నటి ఊర్వశి అన్నారు.
అయితే, తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రాలకు పబ్లిసిటీ ఎక్కువగా అవసరం అవుతుందని, ఈ విషయంలో మీడియా సపోర్టు చేయాలని ఆమె కోరారు. ఊర్వశి ప్రధాన పాత్రలో గురు సోమసుందరం, కలైయరసన్ తదితరులు నటించిన చిత్రం ‘చార్లెస్ ఎంటర్‌ప్రైజస్’. ఈ చిత్రం ఈనెల 16న విడుదలకానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తమిళ నేటివిటీకి అనుగుణంగా మార్చి చిత్రీకరించారు. డెబ్యూ డైరెక్టర్ సుభాష్ లలితా సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జాయ్ ప్రొడక్షన్స్ బ్యానరుపై నిర్మాత డాక్టర్ అజిత్‌జాయ్ నిర్మించారు.
ఈ క్రమంలో ఈ చిత్ర బృందం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నటి ఊర్వశి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఒక చిత్ర నిర్మాణానికి మూలస్తంభం నిర్మాత. నిర్మాతలు బాగుంటే చిత్ర పరిశ్రమ బాగుంటుంది. చిన్న బడ్జెట్ చిత్రాలు విజయం సాధిస్తే ఆ నిర్మాత మరో చిత్రాన్ని నిర్మిస్తారు. దీంతో పలువురుకి ఉపాధి లభిస్తుంది. విలేకరులు నటీనటుల వద్ద ఇంటర్వ్యూలు చేసే సమయంలో మీకు నచ్చిన నిర్మాత ఎవరు అని తప్పకుండా అడగండి.
చిన్న నిర్మాతల బాగుకోసం సీనియర్ నిర్మాత కె. రాజన్ ఏ విధంగా పాటుపడుతున్నారో, అలాగే, నేను కూడా వారికి అండగా ఉంటా. ఈ చిత్ర నిర్మాత అజిత్ జాయ్ అన్ని కోణాల్లో ఆలోచించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ విషయంలో కులమతాలు చూస్తారు. కానీ, స్నేహానికి కులమతాలు లేవు. ఇదే విషయాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారని ఊర్వశి అన్నారు. అలాగే, నటులు కలైయరసన్, గురు సోమసుందరం, దర్శకుడు సుభాష్ లలితా సుబ్రహ్మణ్యం కూడా మాట్లాడారు.