నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి మనకు తెలియని విషయాలు..!

ఈ మధ్య కాలంలో వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె నటించిన ‘క్రాక్’ నాంది’ వంటి చిత్రాలు వరుసగా హిట్ అవ్వడం అలాగే అందులో ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్లో వరలక్ష్మీ డిమాండ్ బాగా పెరిగింది. నెగిటివ్ రోల్స్ లేదా కీలక పాత్రలను అవలీలగా పోషించడంలో ఈమె సిద్దహస్తురాలు కాబట్టి… ఇక్కడ ఈమె డిమాండ్ పెరిగింది. ఇక ఈమె సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురన్న సంగతి తెలిసిందే.

అలా అని అతని భార్య రాధిక కూతురు కాదు. మొదట శరత్ కుమార్… ఛాయా అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన అమ్మాయి వరలక్ష్మీ. కొన్నాళ్ల తరువాత శరత్ కుమార్ హీరోయిన్ రాధికను వివాహం చేసుకోవడంతో.. ఛాయ విడాకులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కొన్నాళ్ల వరకూ వరలక్ష్మీ తన తల్లి వద్దే ఉండేదట. అటు తరువాత తండ్రి శరత్ కుమార్ వద్దకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటూ వస్తోన్న వరలక్ష్మీ..

వారంలో కొద్దిరోజులు తండ్రి దగ్గర మరికొద్ది రోజులు తల్లి దగ్గర ఉంటుందట. ఆదివారం రోజున మాత్రం అందరూ కలుస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం వరలక్ష్మీ తల్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇదిలా ఉండగా.. త్వరలో అల్లు అర్జున్- కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రంలో వరలక్ష్మీ అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఈమె పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్టు టాక్.

1

2

3

4

5

6

7

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus