ఒకట్రెండు సినిమాల్లో నటించి హిట్ అందుకున్న హీరోయిన్లకు అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. అవును సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుని గ్లామర్ పిక్స్ ను అప్లోడ్ చేస్తే దర్శకనిర్మాతలు వీరికి అవకాశాలు ఇస్తారని వారి బలమైన నమ్మకం కావచ్చు. ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో.. ఆఫర్లు లేని హీరోయిన్లంతా సోషల్ మీడియాలో తమ ఫోటోలను అప్లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ విదీష కూడా అదే పని చేస్తుంది.
ఇంతకీ విదీష ఎవరు అనుకుంటున్నారా? అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అటు తరువాత ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఎన్టీఆర్ వదిన పాత్రలో నటించింది కూడా విదీషనే కావడం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పై చెయ్యి చేసుకునే వదిన పాత్ర చేసింది విదీష. అంతేకాదు ఈమె ‘లవ్ లీ’ ‘అడ్డా’ వంటి చిత్రాల్లో నటించిన శాన్వి అక్క కావడం విశేషం. ఈమె కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగమ్మాయిలానే కనిపిస్తుంటుంది.
ఈమెకు ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. అందుకోసమే ఈమె సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తుంది. ఈ ఫోటోలు చూస్తుంటే ఎవ్వరి మతులైనా పోవడం ఖాయం. ఇప్పుడొచ్చే కొత్త హీరోయిన్లకు ధీటుగా ఈమె దూసుకొస్తుందేమో అనేంతలా ఈ ఫోటోలు విదీష గ్లామర్ ఉంది.మరి ఈ ఫోటోలు చూసి అయినా దర్శకనిర్మాతలు ఈమెకు ఛాన్స్ లు ఇస్తారేమో చూడాలి. ఇక విదీష గ్లామర్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.