Actress Vijaya: ఆ హీరోయిన్ల సలహాల వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను : వై.విజయ

సినీ పరిశ్రమలో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.మొదట్లో స్టార్ల రేంజ్లో ఎదిగిన వాళ్ళు తర్వాత కూడు,గుడ్డ, ఉండటానికి చోటు లేకుండా అవస్థలు పడిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. మహానటి సావిత్రి, ఐరన్ లెగ్ శాస్త్రి వంటి నటీనటులు మరణించిన టైం లో వారికేమి లేకుండా అయిపోయింది.ఇక్కడ చేతినిండా అవకాశాలు ఉంటే వాళ్లకు తిరుగుండదు.అలా అని ఆ అవకాశాలు నిరంతరం ఉంటాయా అంటే కచ్చితంగా చెప్పలేం.

అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఇక్కడ బాగా రాణిస్తున్న టైంలోనే ఫ్యూచర్ గురించి కూడా కొంత దాచుకోవాలి అని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. తాజాగా ఇదే విషయాన్ని నటి వై.విజయ కూడా చెప్పుకొచ్చింది. ఆమె చేతిలో పెద్దగా సినిమా అవకాశాలు లేవు. అయినప్పటికీ ఆమెకు ఎటువంటి లోటు లేదు. వ్యాపార రంగంలో బాగానే రాణిస్తుంది. ఆమె ఈరోజు ఇంత సౌకర్యంగా జీవించడానికి ఓ స్టార్ హీరోయిన్ కారణం అంటూ చెప్పుకొస్తోంది ఈ సీనియర్ నటి.

ఆమె మాట్లాడుతూ.. ‘డబ్బుకి సంబంధించిన విషయాల్లో నాకు హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణ.. లు ఇచ్చిన సలహాల వలనే ఈరోజు నేను ఏ లోటు లేకుండా ఉన్నాను. వారిచ్చిన సలహాలు నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ విజయశాంతి ఇచ్చిన సూచనల వల్ల .. నేను ఓ కళ్యాణ మండపం అలాగే ఓ కమర్షియల్ కాంప్లెక్స్ వంటివి కట్టుకున్నాను. షూటింగ్ మధ్య ఉండే గ్యాప్ లో వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చాలా బాగా వివరిస్తూ ఉండేవారు’ అంటూ వై.విజయ చెప్పుకొచ్చింది

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus