Vijayshanthi Husband: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి మనకి తెలియని విషయాలు..!
- May 31, 2020 / 09:00 AM ISTByFilmy Focus
ఎంతో మంది స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగినప్పటికీ.. విజయశాంతికి మాత్రం ఓ ప్రత్యేక స్థానం ఉంది. నిజానికి శాంతి గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈమెకు.. అప్పటి నటి విజయలలిత గారు స్వయానా పిన్ని అన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే ఈమె పేరు శాంతి కాస్త విజయశాంతి అయ్యింది. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ నటించిన ‘సత్యం శివం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయశాంతి.. ‘నేటి భారతం’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
అటు తరువాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతి తక్కువ టైములో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోల చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ‘కర్తవ్యం’ చిత్రానికి గాను నేషనల్ అవార్డుని కూడా దక్కించుకుంది విజయశాంతి. అయితే ఆమె ఫ్యామిలీ లైఫ్ కు సంబంధించిన విషయాలు చాలా మందికి తెలీదు. ముఖ్యంగా ఈమె భర్త గురించి..

ఎవ్వరికీ తెలీదు. అసలు విజయశాంతికి పెళ్ళైందా అని ఆశ్చర్యపడేవాళ్ళు కూడా ఉన్నారు. ఓ స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా.. చాలా సింపుల్ గా పెళ్ళి చేసుకుందట విజయశాంతి. ఇక ఈమె భర్త పేరు శ్రీనివాస ప్రసాద్. ఇతనితో విజయశాంతి కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. విజయశాంతి రాజకీయాల్లోకి రావడం వెనుక కూడా ఈయన ప్రోత్సాహం ఉందట. ఇక ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో విజయశాంతి నటించిన సంగతి తెలిసిందే.
Most Recommended Video












